దక్షిణ కొరియాకు చెందిన బుసాన్ పారిశ్రామికవేత్తల బృందం, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు... బుసాన్ నుంచి 200 కంపెనీలు తక్షణమే రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ఈ పెట్టుబడుల విలువ రూ.10,000 కోట్లు ఉంటుందని వివరించారు... ఈ బృందాన్ని, బుసాన్ కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్ సారధ్యం వచించారు... దాదాపు 30 మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందం, ముఖ్యమంత్రితో పెట్టుబడుల పై చర్చించారు...
ఈ సందర్భంగా, బుసాన్ కాన్సుల్ జనరల్ జియాంగ్ డియోక్ మిన్ చంద్రబాబు పై ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు... పాలనాదక్షత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబును కొరియా దేశీయులంతా గుర్తుపడతారని జియాంగ్ వెల్లడించారు. తెల్లని గడ్డం, గంభీరమైన చిరునవ్వు ఆయన ప్రత్యేకతలన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి... సంప్రదాయాలకూ, కొరియన్ సంప్రదాయానికీ చాలా సారూప్యం ఉందని తెలిపారు. ఆంధ్రలో తల్లిని అమ్మా అని పిలుస్తారని.. తమ దేశంలోనూ అమ్మా అనే పిలుస్తామని.. నాన్నను అప్పా అని అంటామని చెప్పారు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా వారికి తగిన భరోసా ఇచ్చారు... రాష్ట్రాన్ని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ భారీ సంఖ్యలో పరిశ్రమలను స్థాపించాలని ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. బుసాన్ తరహాలో అమరావతిలో గానీ, రాష్ట్రంలో అన్ని అనుకూలతలూ కలిగిన మరో ప్రాంతంలో గానీ కొరియన్ సిటీని ఏర్పాటు చేస్తామని, అక్కడ పారిశ్రామికాభివృద్ధి పార్కును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. డిజైన్, ఇతర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలతో వస్తే అవగాహనా ఒప్పందాలు చేసుకుందామన్నారు.