అక్టోబర్ నెల దాకా చుక్క నీరు... కనీసం ఒక చుక్క నీరు కూడా ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా ప్రవాహం రాలేదు... కాని కృష్ణా డెల్టా మొత్తం, చివరగా ఉన్న దివిసీమ దాకా ప్రతి ఎకరం ఎంత పచ్చగా ఉందో చూడండి... కాలువల్లో కృష్ణమ్మ ప్రవాహం కనపడదు... ఎర్రని గోదారామ్మ పారుతుంది.... వాస్తావాలను నమ్మాలి.. ఊహాగానాలకు తావులేదు... గత ఏడాది ఖరీఫ్ పండిందంటే, ఈ ఏడాది జూన్ లోనే కోస్తా రైతులు 11 లక్ష ఎకరాల్లో నాట్లు వేసుకుని, ఇక వరి కోతలు మొదలు పెట్టారు అంటే, అది పట్టిసీమ ఫలం ... పట్టిసీమతో, ఈ ఏడు సాగుచేసిన వరిపంట తొలిసారిగా కోతకొచ్చింది. గురువారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో వరి కోతలను ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.
గతంలో ఎకరానికి 35 బస్తాలు వచ్చే దిగుబడి. నేడు పట్టిసీమ పుణ్యమా అని 45నుంచి 50 బస్తాలు వస్తుంది.. రైతన్న ఇంట ధాన్యం సిరులు కురిపిస్తోంది... సగటున 38 బస్తాలు తగ్గడం లేదు... సాగు సకాలంలో జరగడం అధిక దిగుబడులకు మరో కారణంగా పేర్కొనవచ్చు... పట్టిసీమ నుంచి వచ్చిన నీటితో నారుమళ్లు మొదలుపెట్టి ఖరీఫ్ ప్రారంభించిన రైతాంగం అదే పట్టిసీమ నీటితో సీజనను సకాలంలో ముగిస్తున్నారు... దీంతో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంట రైతుల చేతికి వస్తుంది... ఇప్పటి వరకు తుఫానులూ ఏమి రాకపోవటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు... అధిక దిగుబడులకు గోదావరి నీరు కూడా ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీటిలో సారవంతమైన బురద మట్టి, జిగురు, ఒండ్రు ఉండటంతో పంట బాగా పండేందుకు దారి తీసిందని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు....
ఏమిటి ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ? (కొంత మందికి ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఏంటో అర్ధం కాక, బుర్ర గోక్కుంటున్నారు.. వాళ్లకి మరో సారి వివరణ): ఈ పట్టిసీమ ఎత్తిపోతల పధకం - భారతదేశ సాగునీటి ప్రాజెక్ట్ లలోనే ఒక సంచలనం, అపూర్వం. దార్శనికత,ఉక్కు సంకల్పం వున్న నాయకుని పర్యవేక్షణలో పురోగతిని ఎలా సాధించవచ్చో ఘనంగా చాటిన వైనంఇది . విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పనిసరిగా మారింది. కాని పోలవరం పూర్తీ చేయాలంటే కనీసం 4 నుండి 6 సం కాలం పడుతుందని అంచనా . అదే సమయంలో ప్రతి ఏటా 3000 టీ ఎం సి ల వరద నీరు గోదావరి నుండి వృధాగా బంగాళాఖాతం లో కలుస్తున్నాయి. వృధాగా పోయే ఈ వరద నీటిలో కొంత భాగాన్ని మళ్ళించి కృష్ణా నదికి అనుసంధానం చేస్తే కృష్ణా జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు నీరు అందించుతూ - తద్ద్వారా ప్రకాశం బ్యారేజ్ కు (కృష్ణా జిల్లా ) విడుదల చేయవలసిన కృష్ణా నికర జలాలను శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దనే నిలువ వుంచి అక్కడి నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా క్షామ పీడిత రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలనే భగీరధ ప్రయత్నం లో భాగమే పట్టిసీమ ఎత్తిపోతల పధకం.