To start with... చంద్రబాబు అనవసర ఖర్చులు పెట్టి, డబ్బా కొట్టుకుంటున్నారు అనే జనాలకి... He is not spending, he is investing... ఆయన రాష్ట్రం కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మన రాష్ట్రానికి అదనంగా మరో రూపాయి పెట్టుబడి రావటం కోసమే... అది చంద్రబాబు దావోస్ పర్యటనలు అయినా, రాష్ట్రంలో జరిగే భారీ సదస్సులు అయినా, మరే రకంగా అయినా.. పెట్టుబడులను రప్పించటానికి, పెట్టుబడుదారులని మన వైపు తిప్పుకునేలా చెయ్యటానికి, చంద్రబాబు ఏ అవకాసం కూడా వదులుకోరు... అందుకే ఆయన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్ అయ్యింది... దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి...
మన కళ్ళ ముందు కియా మోటార్స్ ఇలా వచ్చిందే.... ఎక్కడో కొరియాలో ఉన్న కియా, మన రాష్ట్రంలో ఉండే కరువు ప్రాంతంగా పేరు ఉన్న అనంతపురం వచ్చింది అంటే, అది చంద్రబాబు పరిపాలాన దక్షత... అంతే కాదు, కియా దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడులు పెట్టిన కంపెనీ... ఇలాంటివి ఎన్నో వింటూనే విన్నాం... తాజాగా హైదరాబాద్ వేదికగా గ్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్) సదస్సు జరగటం, దానికి అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చిన సంగతి తెలిసిందే... ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన యువ పారిశ్రామిక వేత్తల బృందాలు ఇక్కడకు వస్తున్నాయి... అయితే ఇలాంటి సదస్సుకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా పేరున్న చంద్రబాబుకి మాత్రం ఆహ్వానం అందలేదు... చంద్రబాబు లాంటోడు ఇలాంటి సదస్సుకి వస్తే, ఇక కెసిఆర్, కేటీఆర్ పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది... దానికి ఎన్నో కారణాలు ఉంటాయి అనుకోండి... ఇప్పుడు అప్రస్తుతం.... అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి ఇగోలో జోలికి పోకుండా, మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రంలోని అవకాశాల గురించి, ఎలా అయినా అక్కడ ఉన్న వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవటానికి, మరో ప్లాన్ తో ముందుకెళ్ళారు...
అక్కడకు వస్తున్న పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా, ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, టైమ్స్ అఫ్ ఇండియాలో, రెండు పేజీల భారీ యాడ్ ఇచ్చారు... మన రాష్ట్రంలోని అవకాశాలు, మనం సాధిస్తున్న వృద్ధి, మన విజయాయి, మనకున్న అవకాశాలు, ఇలా అన్ని విషయాలు ఆ యాడ్ లో ఉన్నాయి... అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఆ యాడ్ లో ఇచ్చారు... ఆ సదస్సుకు వస్తున్న గెస్ట్ లలో చాలా మంది న్యూస్ పేపర్స్ చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది... అందునా టైమ్స్ అఫ్ ఇండియా టాప్ న్యూస్ పేపర్ కావటంతో, ఎక్కువ మంది అది చదివే అవకాసం ఉంది, అందుకే మన అధికారులు, ఈ మార్గాన్ని ఎంచుకుని, మన రాష్ట్రం గురించి ఇలా పారిశ్రామికవేత్తలకు తెలిసేలా చేస్తున్నారు... ఇంతే కాకుండా, మిగతా మాధ్యమాలు, మార్గాలు ద్వారా, వన్ టు వన్ మీటింగ్స్ కి కూడా అప్పాయింట్మెంట్ అడుగుతూ, ఇలా ఏ మార్గం కుదిరితే ఆ మార్గం ద్వారా, మన రాష్ట్రం గురించి ప్రోజెక్ట్ చేస్తున్నారు మన అధికారాలు... వీరి ప్రయత్నం ఫలించాలి అని ఆశిద్దాం..