విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, అంత లేట్ అవుతుంది... ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు నుంచి జాప్యం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం... ఎవరైనా ఈ జాప్యానికి మొదట నిందించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని... కాని, వాస్తవ పరిస్థితి మాత్రం వేరు... కేంద్రం రకరకాలుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇబ్బంది పెడుతుంది... నేషనల్ హై వే మీద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు.... కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. దీంతో అసలకే దారుణంగా నడుస్తున్న ప్రాజెక్ట్, మరింత జాప్యం అవుతోంది. మరోవైపు డీవియేషన్లు (మార్పులు, చేర్పులను) కూడా కేంద్రం అంగీకరించక పోవటంతో ఢిల్లీ నుంచి అమరావతికి ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పేరు కేంద్రానికి... ఊరు రాష్ట్రానికి అన్నట్లు తయారైంది... రూ. కోట్ల వెచ్చిస్తున్నా, అది కేంద్ర ప్రాజెక్టు ఖాతాలోకి వెళ్లింది.

kanaka durga flyover 22112017 2

ప్రాజెక్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం భారం పడింది. కేంద్రం భరించేందుకు తిరస్కరించింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.114.60 కోట్ల ఖర్చు చేయాల్చి ఉండగా ఇప్పటికే దాదాపు 170 కోట్ల వెచ్చించింది. మరో రూ.19.52 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడనుంది. కేంద్రం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో మాత్రం పిసినారిగా వ్యవహరిస్తోందని ఇంజనీర్ల వాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రెండున్నరేళ్ల గడిచింది. ఈ వంతెన పూర్తి కావాలంటే మరో ఏడాది పైగా పడుతుందని అంటున్నారు. కానీ అధికారులు మాత్రం వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కనకదుర్గ పైవంతెన నిర్మాణ బాధ్యతలను సోమా కనస్టక్షన్ కంపెనీ చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగు వరసల రహదారి, కనకదుర్గ పైవంతెన కలిపి రూ. 448.60 కోట్లకు దక్కించుకుంది. మొత్తం ప్రాజెక్టులో ఇప్పటి వరకు కేవలం 58 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఆరు నెలల్లో మిగిలిన 42 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. 

kanaka durga flyover 22112017 3

అయితే ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334 కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇది జాతీయ రహదారి కావడంతో దీన్ని కేంద్రం చేపట్టింది. కానీ నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. కాంట్రాక్ట సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని అందుకే నిర్మాణం జాప్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావటం లేదు... ఈ ప్రాజెక్టు డీవియేషన్ వల్ల అధనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి వంతెనకు రూ.114.60 కోట్ల కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్ల చెల్లింపులు జరిపింది . ఈ పై వంతెన పనులు ప్రారంభం అయిన నాటి నుంచి ఇంత వరకు రూ.150 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లలు మంజూరు అయ్యాయి. అంటే కేవలం 40 శాతం మాత్రమే కావడం విశేషం. ఇదే సమయంలో రాష్ట్రం తన పరిధికి మించి నిర్మాణం జాప్యం కాకూడదనే ఉద్దేశ్యంతో రూ.170 కోట్ల వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మ చేపట్టిన కనక దుర్గ పైవంతెన నిర్మాణం తీరు ఇది. కేంద్రం సహకరించకపొతే, ఇది కూడా ఇప్పుడు అప్పుడే అవ్వదు.... నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇటు రాష్ట్రాన్ని చేసుకోనివ్వరు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read