ఒక పక్క హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య చిచ్చు పెడుతున్న సినిమా మాఫియాని చూస్తున్నాం... ఏ నాడు రచ్చ చెయ్యని వీరు, ఇప్పుడు మాత్రం నంది అవార్డుల విషయంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వాన్ని నిందిస్తూ, కులాల మధ్య గొడవలు సృష్టించి, ఆంధ్రప్రదేశ్ లో అశాంతిని రేకెత్తించి, చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారు... అయితే, సినీ హీరో జగపతి బాబు మాత్రం, ఈ మాఫియాకి భిన్నంగా వ్యవహరిస్తూ, ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేస్తూ, ఈ మాఫియాకి బలైపోతున్న చిన్న సినిమాలు రక్షించాలి అంటూ పాదయత్ర చేస్తున్నారు... అంతే కాదు, ఇవాళ బెజవాడలో మాట్లాడుతూ, ఒక అడుగు ముందుకేసి, తెలుగు సినిమా ఇండస్ట్రీ, హైదరాబాద్ వదిలి, ఆంధ్రప్రదేశ్ వచ్చెయ్యాలి అన్నారు...
నిజంగా ఈ కామెంట్, ప్రతి ఒక్క ఆంధ్రుడు హర్షిస్తారు... తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కవ బిజినెస్ జరిగేది ఆంధ్రప్రదేశ్ లో, కాని ఇక్కడకు ఒక్కడు రాడు... ఒక్క ఆడియో ఫంక్షన్ చెయ్యరు.... అక్కడ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేసినా స్పందిస్తారు, ఇక్కడ మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు... ఇలాంటి సందర్భంలో జగపతి బాబు, హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్ వచ్చెయ్యాలి అని కామెంట్ చెయ్యటం, నిజంగా డేర్ స్టెప్... అంతే కాదు, ఇప్పుడు ఎవరైతే గొడవ చేస్తున్నారో, ఆ మాఫియా పై పోరాటం చేస్తున్నారు కూడా... ధియేటర్లు కొంతమంది చేతుల్లో వుండటం వల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయని, కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న చిత్రాలను ప్రోత్సహించాలని కోరుతూ ఆయన పాదయాత్ర చేశారు. ఆయన వెంట అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ నుంచి భవన్నారాయణ వీధి రోడ్డు, శంకర్ కేఫ్ సెంటర్ మీదుగా సామారంగ చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తన పాదయాత్రకు అసౌకర్యం కలిగించకుండా తగిన భద్రతా ఏర్పాట్లు ఏర్పాట్లు చేపట్టిన వెస్ట్ జోన్ ఏసీపీ జి.రామకృష్ణ కార్యాలయానికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.