వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కర్నూలు జిల్లా పాదయాత్రలో మరోసారి పోలీసుల మీద చిందులు వేశారు... ఈ సారి ఏకంగా పోలీసు బాసులకు హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఉండదు, మరో సంవత్సరంలో నేనొస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం పని చెయ్యండి, ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. పోలీస్ బాసులకు కూడా నేను అదే విషయం చెబుతున్నానని, ఎల్లప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం ఉండదన్నారు... త్వరలో నేను వస్తా... ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు.
నిజానికి జగన్ పాదయత్ర షడ్యుల్ ప్రకారం జరగాలి, ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలి... ఇది జగనే స్వయంగా పోలీసులకు పాదయత్ర ముందు పోలీసులకి రాసింది... జగన్ కు z క్యాటగిరీ బద్రత ఉంది అని, పోలీసులు తగు ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పారు... ఇప్పుడు జగన్ మాత్రం, అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ సభలు పెడుతున్నారు... ఇదే విషయం నిన్న పోలీసులు లేవనెత్తారు..అనుమతి లేకుండా హుసేనాపురంలో సమావేశం నిర్వహించవద్దు అని చెప్పినా వినలేదు... దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.... మేము రూల్ ప్రకారం పని చేస్తున్నామని, ఇలా చెయ్యకపోతే ఏదన్నా జరిగితే మమ్మల్నే నిందిస్తారని, ఇప్పుడేమో మాకే వార్నింగ్ లు ఇస్తున్నారని పోలీసులు బాధపడుతున్నారు...
నిజానికి జగన్, ఇలా ప్రవర్తించటం మొదటి సారి కాదు... వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ అంటూ అక్కడ పోలీసుల మీద రంకెలు వేసింది చూశాం... అలాగే దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు ఉన్న, కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ అహ్మద్ బాబుని, నిన్ను జైలుకి తీసుకుపోతా అన్నది చూశాం... ప్రభుత్వ డాక్టర్ ల దగ్గర బలవతంగా, చేతిలో రిపోర్ట్ లు లాక్కుంది చూశాం.. ఇది జగన్ విపరీత ప్రవర్తనకు అర్ధం పడుతుంది... తనకు తానూగా, అతీత శక్తి అనుకుంటూ, ముఖ్యమంత్రి అయిపోయాను అనుకునే భ్రమలో, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు...