15 రోజుల పాదయాత్రకే జగన్ మాంచి కాన్ఫిడెన్సు తో ఉన్నారు... ప్రశాంత్ కిషోర్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారో, లేక సర్వే చేసారో కాని, వచ్చే ఎన్నికల్లో 137 స్థానాల్లో గెలుస్తానాని, నేనే సియం అని జగన్ అన్నారు.... అంటే, మిగతా 38 స్థానాల్లో, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బిజేపి పంచుకోవాలి అని జగన్ అర్ధం... జగన్ మాటలు వింటుంటే, 2009లో ప్రజా రాజ్యం పెట్టినప్పుడు, అల్లు అరవింద్ మేము 292 సీట్లు గెలుస్తాం, మిగతా రెండు చంద్రబాబుకి, వైఎస్ఆర్ కి ఇస్తాం అన్న మాటలు గుర్తుకొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...

jagan 22112017 1

అంతే కాదు ఒక అద్బుతమైన స్టొరీ కూడా చెప్పారు... ‘మీరు సినిమాకు వెళ్తే.. అబద్ధాలు చెప్పుతూ.. వెన్నుపోటు పొడుస్తూ.. అన్యాయాలు, అక్రమాలు చేసే విలన్‌ నచ్చుతాడా..? విలన్‌ సృష్టించే కష్టాలను ఎదుర్కొని నీతిగా, న్యాయంగా ఉండే హీరో నచ్చుతాడా..? అన్యాయాన్ని ఎదురించే హీరోయే నచ్చుతాడు. రాబోయే ఎన్నికల్లో హీరోలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.... ఇలాంటి మాటలే నంద్యాలలో మాట్లాడితే, ఎవరు విలన్, ఎవరు హీరో అనేది స్పష్టమైన తీర్పు ఇచ్చిన సంగతి జగన్ మర్చిపోయారు...

jagan 22112017 2

జగన్ దగ్గరకు వచ్చి ఎవరు ఏ సమస్య చెప్పినా, ఒక సంవత్సరం ఆగండి, నేను ముఖ్యమంత్రి అయిపోతా అంటూ వారికి భరోసా ఇస్తున్నారు... 45 ఏళ్ళకు పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, బడికి పంపిస్తే 15 వేలు, ఇలా నోటికి ఏది వస్తే అది చెప్పేస్తూ, నవరత్నాలు అంటూ ప్రచారం చేస్తున్నారు... 2019 ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తుందని, ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలు అమలు చేసి పేదలు మెచ్చే పాలన అందిస్తానని, అవినీతి పై పోరాటం చేసి, అవినీతి పరులని జైలులో పెట్టిస్తా అని జగన్ చెప్పారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read