సమర్ధవంతమైన ముఖ్యమంత్రికి, సమర్ధవంతమైన అధికారి తోడైతే ? టెక్నాలజీతో పరిపాలన సాగించి, ప్రజలకు మరిన్ని సేవలు అందిచాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి, ప్రభుత్వ ఉద్యోగులు తోడైతే ? ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ? మనల్ని పాలించే నాయకులు, అధికారులు, మనకోసమే వినూత్న ఆలోచనలతో, మన ముందుకు వస్తుంటే, అంతకంటే మనకు ఏమి కావలి... ఇలాంటి నాయకులు అరుదుగా ఉంటారు, ఇలాంటి అధికారులు, ఇంకా అరుదుగా దొరుకుతారు.... నవ్యాంధ్రకు అలాంటి ఒక సమర్ధవంతమైన అధికారే నండూరి సాంబశివరావు... ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా, తనదైన ముద్ర వేస్తూ, ప్రజలకు మరింత దగ్గరవతున్నారు... శేషాచల అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌, ఉత్తరాంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నక్సలైట్ల బెడద, రాష్ట్రంలో, కొత్త రాజధానిలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా చూడటంలో ఆయన విజయం సాధిస్తున్నారు... ఇలాంటి అధికారిని మన రాష్ట్రం నుంచి తప్పించటానికి, బీహార్ బ్యాచ్ రాగంలోకి దిగింది...

dgp 22112017 2

అయితే సాంబశివరావు గారు ప్రస్తుతం ఇంచార్జి డిజిపిగా ఉన్నారు... పూర్తి స్థాయి డిజిపిగా ఆయన్ను కొనసాగించాలని అని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఫైల్ తిప్పి పంపింది... ఇవాళ (నవంబర్ 22న) డిజిపి ఎంపిక జరగాల్సి ఉన్నా, అది వాయిదా పడింది... సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవర్ని అయితే ప్రతిపాదిస్తుందో, వారని కేంద్రం ఏ అభ్యంతరం లేకుండా ఆమోదిస్తుంది... రాష్ట్ర ప్రభుత్వం ఒక సమర్ధవంతమైన అధికారిని కొనసాగించమంటే, కేంద్రానికి అభ్యంతరం ఏంటి ? ఎవరి ఒత్తిడిలకు లొంగుతున్నారు అనేది ప్రభుత్వం ఆరా తీస్తుంది... దీని వెనుకు బీహార్ లాబీ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి... మరొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, వైఎస్ జగన్ సలహా దారుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్, ఈ లాబీ చేస్తున్నారు.... సాంబశివరావుని కొనసాగించకుండా, బీహార్ కి చెందిన ఐపిఎస్ ఠాకూర్ ని నియమించాలి అని, ప్రశాంత కిశోరే ఉత్తరాది నాయకులు ద్వారా లాబీ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి...

dgp 22112017 3

ఇప్పుడు డిజిపి ఎంపిక జరిగితే, రెండేళ్ళ పాటు వారే ఉంటారు... అంటే, 2019 ఎలక్షన్స్ దాకా ఉంటారు... సాంబశివరావు గారు మళ్ళీ డిజిపి అయితే, జగన్ బ్యాచ్ చేసే ఆగడాలు వర్క్ అవ్వవు... డిజిపి సాంబశివరావు అంటే ఏంటో, ఇప్పటికే జగన్ కు తెలుసు... ఆటలు సాగవు అని తెలుసు... అందుకే ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపాడు... ప్రశాంత్ కిషోర్ 2014లో మోడీ సలహాదారుడిగా పని చేసాడు కాబట్టి, బీజేపి పెద్దలతో పరిచయాలు బాగా ఉన్నాయి... ఉత్తరాదిన చాలా మంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అవి ఉపయోగించి, బీహార్ లాబీ ద్వారా, బీహార్ కి చెందిన ఐపిఎస్ ఠాకూర్ ని నియమించాలి అని ప్రశాంత్ కిషోర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు, ప్రభుత్వ వర్గాలు పసి గట్టాయి... ఒక పక్క మిత్ర పక్షంగా ఉంటూ, బీజేపి ఆడుతున్న గేమ్ పసిగట్టే రెండు సార్లు కేంద్రం ఫైల్ తిప్పి పంపినా, రాష్ట్ర ప్రభుత్వం, మా ఫైనల్ లిస్టు ఇదే అంటూ, మళ్ళీ అదే ఫైల్ తిప్పి కేంద్రానికి పంపింది... ఇది ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read