ముఖ్యమంత్రి అవ్వటమే లక్ష్యంగా పాదయత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, అస్త్ర సస్త్రాలు బయటకు తీస్తున్నారు... అక్కడ ఏమున్నాయి అంత చేటు అస్త్రాలు అంటారా... ఇప్పుడు ఇంకో అస్త్రం బయటకు వచ్చింది... అయితే, ఈ అస్త్రం కూడా రోజా, కొడాలి నాని లాంటి అస్త్రాలతో సమానంగా ఉంటుంది... ఆ అస్త్రం ట్రాక్ రికార్డు అలాంటిది... ఈ అస్త్రానికి కూడా పవర్ఫుల్ లెగ్ అనే ట్యాగ్ ఉంది.. మిగతా రెండు అస్త్రాలు లాగే, ఇది కూడా బూతులు మాత్రమే మాట్లాడుతుంది... దీనికి ఎక్స్ట్రా క్వలిఫికేషన్ ఏంటి అంటే మెంటల్ కూడా కొంచెం ఉంది (అది వారు చెప్పుకుందే)... ఈ అస్త్రం కూడా, చంద్రబాబుని తిట్టటమే పని.... ఇన్నాళ్ళు ఎక్కడికి పోయిందో, ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, అందుకే ఈ అస్త్రం 2019 దాకా కాంట్రాక్టు కుదుర్చుకుని రంగంలోకి దిగింది... ఆ అస్త్రం పేరే మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని మురళి కృష్ణ...

posani 21112017 2

అయ్య వారు ఈ మధ్య నాకు జగన్ అంటే ఇష్టం, చచ్చే వరకు జగన్ తోనే అన్నారు... అప్పట్లో 2004లో చంద్రబాబుని, 2009లో చిరంజీవిని కూడా ఇలాగే అన్నారు అనుకోండి... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ లో కూర్చుని, నంది అవార్డుల ముసుగులో, మన రాష్ట్రంలో కుల చిచ్చు పెడదాం అనుకున్న వారిని గెట్టిగా హెచ్చరించటంతో, ఈ అస్త్రం ఇప్పుడు బయటకు వచ్చింది... స్క్రిప్ట్ ప్రకారం, చంద్రబాబుని, లోకేష్ ని తిట్టాడు ఈ మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని మురళి కృష్ణ... సరే రాజకీయంగా తిట్టుకో, రాష్ట్ర ప్రజలకు దీంతో పోయేది ఏమి లేదు... కాకపొతే, ఇన్నాళ్ళు ఎక్కడకి పోయావు మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని మురళి కృష్ణ ? ఏనాడైనా రాష్ట్ర సమస్యలు మీద కాని, రాష్ట్రంలో జరుగుతున్న మంచి కాని, రాజధానిలో సమస్యలు కాని (గుంటూరు వాడివి కదా), ఏనాడైనా ప్రస్నించావా, మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని మురళి కృష్ణ ? ఊరికే కెమెరా ముందు మొరగటం కాదు, ప్రభుత్వం ఎవర్ని అంది ? హైదరాబాద్ లో కూర్చుని, కుట్రపూరితంగా, మన రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్న సన్నాసులని అంది... అంటే కులాల మధ్య చిచ్చు పెడతా ఉంటే, ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా ?

posani 21112017 3

3 రోజుల పాటు, 24/7 ఇదే చూపిస్తూ, మన రాష్ట్రంలో అలజడికి ప్లాన్ చేసిన న్యూస్ చానల్స్ రెచ్చిపోతుంటే ఎందుకు మాట్లాడలేదు ? హైదరాబాద్ లో కూర్చుని, కులాల మధ్య చిచ్చు పెట్టేలా వాగుతుంటే, నువ్వు ఎందుకు రాలేదు ? అలాంటి వారిని ప్రభుత్వం ఖండిస్తే, అది తప్పా ? ఇప్పుడు బయటకు వచ్చి మొరుగుతున్నావ్ అంటే, నీ అజెండా ఏంటో ప్రజలకు తెలీదు అనుకుంటున్నావా ? ఈ ప్రెస్ మీట్ పెట్టి, మన రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్న వారి మీద, వాగితే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం నీ వెనుక ఉండేది... అయినా, జగన్ గారు, ఇన్ని ఐరన్ లెగ్ లు ఎందుకు అండీ చుట్టూతా, ఎన్ని పాదయత్రలు చేస్తే ఏమి లాభం ? ఈ పోసాని ఐరన్ లెగ్ హిస్టరీ ఏంటో తెలుసా ? 2004 లో టీడీపీకి మద్దతుగా ఈనాడులో అర పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు....టీడీపీ మాటాష్.... 2009 లో ఎమ్మెల్యే సీట్ తీసుకుని పీఆర్పీ తరుపున పోటీ... పీఆర్పీ మాటాష్.... 2014 నుంచి ఇప్పటిదాకా మీకు మద్దతు ఇస్తున్నాడు.... మీ ఫ్యూచర్ మాకు క్లియర్ గా కనిపిస్తుంది జగన్ గారు... బెస్ట్ అఫ్ లక్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read