అనంతపురం జిల్లా పెనుగొండలోని ఎర్రమంచి గ్రామం దగ్గర, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్ తమ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని శరవేగంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే... మొన్నటి దాకా ఊరూపేరూ లేని ఓ చిన్న ఊరు ఇది. ఇవాళ ఇక్కడ 587 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అనంతపూర్ జిల్లాకి సిరులు అందించబోతున్న ఒక అద్భుతం ఆవిష్కృతమవుతోంది. కియా మోటర్స్. యుద్ధ ప్రాతిపదికన కియా పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వస్తుంది...

kia 23112017 2

ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, మన అనంతపూర్ కియా గురించి చెప్తున్నారు... కియా మోటార్స్ రూ.13వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది.. ఇది దేశంలోనే అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్... ఈ ప్లాంటు వలన 11వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి... కొరియా నుంచి తెప్పించిన సామగ్రితో తాత్కాలిక పరిపాలన భవనాన్ని నిర్మిస్తున్నారు. కార్లకు వాడే పెయింట్‌ నిల్వ కోసం పెద్దఎత్తున గుంతలు తీసి కాంక్రీటుతో నిర్మాణాలు చేస్తున్నారు. బాడీ షాప్‌ కాంక్రీటు పనులు కూడా మొదలయ్యాయి. రోజుకు 68 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణమూ జరుగుతోంది...

kia 23112017 3

కియ ప్లాంటులో పని చేస్తున్న, చేయనున్న కొరియా అధికారులు, సిబ్బంది కోసం... ఇక్కడే 30 ఎకరాల్లో పూర్తిగా వారి శైలిలో ప్రత్యేక టౌన్‌ షిప్‌ నిర్మిస్తున్నారు.ఇక్కడ కొరియా ఆహార పదార్థాలను వండి వడ్డించేందుకు క్యాంటీన్‌ కూడా సిద్ధమవుతోంది. దానికి అనుకునే... 12 ఎకరాల్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి సాధించిన ‘కియ’కు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. అటు... పరిశ్రమ వర్గాలు కూడా అదే స్థాయిలో, శరవేగంగా పనులు సహకరిస్తుండటం విశేషం. ఇక... కియకు అనుబంధంగా రానున్న సంస్థల కోసం 600 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. 2019 నాటికి ఇక్కడ నుంచి, మొదటి కార్ ఉత్పత్తి అవుతుంది... ఒక దార్శనికుడి సంకల్పం, దూరదృష్టి, అకుంఠిత దీక్ష వల్ల ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే ఆటోహబ్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చెందబోతోంది. ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కధనం మీరూ వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read