నిన్న కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రాజీనామా చేసారంటూ మీడియాలో హడావిడి అయిన సంగతి తెలిసిందే... సీఎంవోలో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్ అవమానించారంటూ, వంశీ మనస్తాపానికి గురయ్యారు. ఈ ఇష్యూ అంతటికీ కారణం హనుమాన్ జంక్షన్ లోని డెల్టా షుగర్ ఫ్యాక్టరీ... ఈ డెల్టా షుగర్ ఫ్యాక్టరీ బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబానికి చెందింది... గోకరాజు గంగరాజు కూడా దీంట్లో డైరెక్టర్ గా ఉన్నారు... అయితే ఉన్నట్టు ఉండి, ఈ సంవత్సరం క్రషింగ్ సమయంలో దానిని మూసివేశారు... దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురైన రైతులు గన్నవరం ఎమ్మల్యే వంశీ దగ్గరకు వెళ్లి సమస్య చెప్పుకున్నారు... డెల్టా షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో వంశీ మాట్లాడినా, ఉపయోగం లేక పోయింది... నేషనల్ హైవేకు అతి సమీపంలో దాదాపు 100 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది... ఫ్యాక్టరీ ఎత్తేసి, ఎమన్నా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాలని డెల్టా షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అనుకుందో ఏమో అని, అక్కడి రైతులు అంటున్నారు....
అయితే ఇదే సమయంలో, వంశీ ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు... ముఖ్యమంత్రి ఈ విషయం గురించి అలోచించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు... అందుకు అనుగుణంగా, సీఎంవో అధికారులు సచివాలయంలో, ఆంధ్రా షుగర్స్, కేసీపీ షుగర్స్, డెల్టా షుగర్స్ యాజమాన్యంతో సమావేశం అయ్యారు... ఈ సమయంలో వంశీ కూడా అక్కడకి రావటంతో, ఇది శాఖాపరమైన మీటింగ్ అని, ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉండకూడదు అని, మీకు నిర్ణయం చెప్తాం అని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, వంశీని అనటంతో, వంశీ మనస్తాపానికి గురై, రాజీనామా దాకా వెళ్లారు...
ఇదే విషయం పై ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం అందరినీ పిలిచి రివ్యూ చేశారు... ఈ సమావేశంలోనే సమస్యను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డెల్టా షుగర్స్ పరిధిలో ఉన్న చెరుకును కేసీపీ, ఆంధ్రా షుగర్స్‌కు చెరి సగం కేటాయించారు. రైతులు పాత ఫ్యాక్టరీ వద్దకు చెరుకు తీసుకు వస్తే అక్కడి నుంచి కొత్త ఫ్యాక్టరీలు వారు తీసుకువెళ్తారు... దీంతో రైతులకి రవాణా చార్జీల ఖర్చు తగ్గనుంది... ఇదే సమయంలో, ముఖ్యమంత్రి వంశీతో మాట్లడారు.. ప్రతి చిన్న దానికి భావోద్వేగానికి గురి కావద్దని చెప్పారు... ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయితే ప్రజల్లో చులకన అవుతామని, ఏదైనా సమస్య ఉంటే తనకు ముందుగా చెప్పాలని చెప్పారు... ఇదే సమయంలో, సమాచార లోపం వల్ల ఉదయం అలా జరిగిందని, మనసులో పెట్టుకోవద్దని గిరిజా శంకర్ కోరారు. ఇద్దరూ కరచాలనం చేసుకొని జరిగినదానిని అంతటితో వదిలివేయాలని అనుకొన్నారు.