మన హైదరబాద సినిమా బ్యాచ్ తీరు ఎలా ఉందో వారం నుంచి చూస్తున్నాం... మన రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటి అంటే ఒక్కటి, ఇప్పటి దాకా ఒక్కడు చెయ్యలేదు... కాని, ఇక్కాడ సినిమా పిచ్చోళ్ళు వాళ్ళ సినిమా చూస్తేనే వారికి బ్రతుకు... కాని, మన రాష్ట్రం అంటే వారికి చిరాకు... ఏ నాడు మన ప్రభుత్వాలు మంచి కార్యక్రమం చేస్తే స్పందించవు, కాని తెలంగాణా ప్రభుత్వం అడగక పోయినా ఎగబడతారు.. లేకపోతె కెసిఆర్ 10 కిమీ లోతులో పాతేస్తాడుగా... అందుకే మన రాష్ట్రం నంది అవార్డులు ప్రకటిస్తే, హైదరాబాద్ లో కూర్చుని, మన రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టటానికి చూశారు... ఏ నాడు రూపాయి సహాయం చెయ్యని ఇలాంటి వారికి, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన చర్యలతో, శభాష్ అనిపించుకున్నారు...
నిన్న రజినీకాంత్ కర్నూలు జిల్లా, మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ మంగళవారం ఉదయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీ మఠానికి వచ్చిన ఆయనకు అర్చకులు సాదర స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో శ్రీ మఠానికి రూ. 20 కోట్లను విరాళంగా అందించారు.
అనంతరం రజనీకాంత్ మఠాధిపతి సుబుదేంద్రతీర్థులను కలిసి కొంచెం సేపు చర్చించారు. మఠంలో నిర్మాణాలు శిధిలావస్థకు చేరుకున్నాయని, భక్తులకు వసతుల అవసరం ఉందని తెలుసుకున్నారు. దీంతో మఠం ఆధునీకరణకు రూ.20 కోట్లను విరాళంగా అందించారు. ఆ నిధితో భక్తుల బస కోసం 25 ఏసీ గదులను, మరిన్ని వసతి గదులను నిర్మించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి, మన రాష్ట్రానికి రూపాయి కూడా సహాయం చెయ్యని మన తెలుగు హీరోల కంటే, రజినీకాంత్ చాలా నయం అనిపించారు...