ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి... ఇప్పటికి తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీ లాగా కనిపిస్తుంది... కాంగ్రెస్ పార్టీ అసలు ఉందో లేదో కూడా తెలీదు, కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి అంతే... పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే కాని అసలు ఆ పార్టీ విధానం తెలీదు... ఇంకా మిగిలింది జగన్ పార్టీ... ఆ పార్టీకి, ప్రజలకు మధ్య కనెక్షన్ ఎప్పుడో తెగిపోయింది... కొంత మంది కులం, మతం ఆధారంగా తప్పితే, ఆ పార్టీ గురించి ఆశలు పెట్టుకున్న ప్రజలు ఎవరూ లేరు... నాకు సియం కుర్చీ తప్ప అసలు యావ లేదు అనే విధంగా, జగన్ ప్రవర్తిస్తూ ఉంటాడు... దీంతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ వాక్యుం చాలా ఉంది...
అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు, ముద్రగడతో కలిసి కొత్త రాజకీయ పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు... ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఫార్ములా తరహాలో కాపులు, దళితుల కాంబినేషన్లో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కదులుతున్నారు. ముద్రగడతో పాటుగా కేంద్ర మాజీమంత్రి చింతామోహన్, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్ కలిసి పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారు.. దీనికి సన్నాహకంగా అన్నట్టు, తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మాజీ మంత్రి శైలజానాధ్, మాజీ ఎంఎల్ఎలు పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, కొప్పుల రాజు తదితరులు కూడా హాజరు కావడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి...
మరో పక్క, ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కుట్రగా కూడా రాజకీయ పరిశీలకలు చూస్తున్నారు... ముద్రగడకు కనీసం సొంత ఊరిలో కూడా వోట్లు వెయ్యరు అని, కాంగ్రెస్ నాయకులు అంటేనే రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటారని, ఇలాంటి వారందరూ పార్టీ పెట్టటం వెనుక, చంద్రబాబుని దెబ్బ తీసే కుట్ర ఉంది అని అంటున్నారు... తద్వారా జగన్ కు లాభం చేకూరే ఆలోచనగా చెప్తున్నారు.... గోదావరి జిల్లాల్లో చంద్రబాబు స్వీప్ చెయ్యటం ఖాయంగా కనిపిస్తుంది.. ఇక్కడ కనుక మెజారిటీ సీట్లు వస్తే, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు... అందుకే ఇక్కడ దెబ్బ కొట్టాలి అంటే, కొత్త పార్టీతో ఓట్లు చీల్చాలి అనే ప్లాన్ వేసారు అని అంటున్నారు... తద్వారా తెలుగుదేశం, జనసేన కాంబినేషన్ ఎదుర్కుని, ఓట్లు చీల్చి, జగన్ కు లాభం చేకూర్చే ప్లాన్ గా రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు...