Sidebar

29
Sat, Mar

నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖకు మరో గుర్తింపు లభించింది... విభజన తరువాత, విశాఖను నవ్యాంధ్ర వెన్నుముకగా చెయ్యటానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు... ఇప్పుడు వైజాగ్ దేశంలో 9 వ ధనిక నగరంగా పేరు తెచ్చుకుంది... యాహూ ఇండియా ప్రకటించిన టాప్ 10 ధనిక నగరాల్లో విశాఖ 9వ స్థానం సంపాదించింది... 2016వ సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకుల్లో, GDP (స్థూల దేశీయోత్పత్తి) ప్రకారం సర్వే నిర్వహించింది. భారతదేశంలోని టాప్ 10 ధనిక నగరాల్లో 9 వ ర్యాంకును పొందేందుకు విశాఖ గుజరాత్ లోని సూరత్ ను అధిగమించింది... హైదరాబాద్ జాబితాలో 5 వ స్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే, వైజాగ్, సూరత్ టాప్ 10 ధనిక నగరాలు...

vizag 14112017 2

అంతే కాదు ఈ మూడేళ్ళలో విశాఖ ఎంతో మారిపోయింది... స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏకంగా, రెండో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపించింది.

vizag 14112017 3

విశాఖకు సుందర నగరంగానే కాదు, ఉపాధి కేంద్రంగా మంచి పేరు ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా వాసులతో పాటు, ఇటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు కూడా విశాఖలో ఉపాధి అవకాశాలను చూసుకుంటారు. అలాగే, పొరుగున ఉన్న ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కూడా విశాఖకు పొట్ట చేత పట్టుకుని వస్తూంటారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్ధలతో పాటు, వందలాదిగా ప్రైవేటు రంగంలోనూ ఉన్నాయి... మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎప్పటికీ, శాంతి భద్రతలతో, పూర్తి ప్రశాంతంగా ఉండాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read