ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, కేసీఆర్ అనంతపురంలో, పరిటాల శ్రీ రాం పెళ్లిలో కలిసిన సందర్భంలో జరిగిన హంగామా తెలిసిందే... అయితే, ఇప్పుడు మళ్ళీ పయ్యావుల కేశవ్, కేసీఆర్ ని కలిసారు... కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆయన, దాదాపు పావుగంట పాటు అక్కడే ఉన్నారు. ..ఈ విషయం స్వయంగా కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా తన ఫేస్బుక్ ఎకౌంటులో పోస్ట్ చేశారు...
పయ్యావుల కేశవ్ కుటుంబంలో జరిగే పెళ్లికి ఆహ్వానించేందుకు ఆయన వచ్చారని కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ సమయంలో ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. కాగా, అనంతపురం జిల్లాలో జరిగిన పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లినప్పుడు, హెలిపాడ్ వద్ద పయ్యావుల కేశవ్ ను స్వయంగా పిలిపించుకున్న కేసీఆర్, ఆయనతో కాసేపు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
పయ్యావులకు, కేసీఆర్ కు మధ్య వ్యాపార సంబంధాలున్నాయని, తెలంగాణలో కాంట్రాక్టులను పొందారని, టీడీపీకి రాజీనామా చేసిన తరువాత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పయ్యావుల కేశవ్, పరిటాల కుటుంబాలు బార్లు, లిక్కర్ తయారీ కంపెనీ లైసెన్స్‌లు తెచ్చుకున్నారని ఆరోపించడం దుమారం రేపింది. తాజాగా మరోసారి కేసీఆర్‌ను పయ్యావుల కేశవ్ కలిశారు. తన సోదరుడు కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు కేసీఆర్‌ను కలిశారు.