అందు గలడు, ఇందు లేడని.. ఎందెందు వెతికినా నీవే కదయ్యా... జగన్ అయ్యా... మళ్ళీ మనకు ఛాలెంజ్ ఒకటి... మనం బయట తిరిగేది బెయిల్ పైన... 16 నెలలు జైలులో ఉన్నాం... మనం కూడా ఛాలెంజ్ చేస్తే ఇలాగే ఉంటుంది... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెకైట్ ల వివరాలు బయటపెడుతున్న ప్యారడైజ్ పేపర్స్, ఇప్పటికే జగన్, నిమ్మగాడ్డ కలిసి ఎలా కొట్టేసారో బయట పెట్టింది... ఇప్పుడు తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీతో కలిసి చేసిన భాగోతం బయట పెట్టింది... మారిషస్‌లో ఓ కంపెనీని ప్రారంభించి దాని ద్వారా కొన్ని వందల కోట్ల పెట్టబడులను స్వదేశంలోని కంపెనీలకు ప్రవహింపచేశారు. అలా వచ్చిన సొమ్మునే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు... అల్లిబిల్లి కంపెనీల ద్వారా, జగన్ ఎలా కొట్టేసాడో, ప్యారడైజ్ పేపర్స్ పూర్తి వివరాలతో బయట పెట్టింది...
2007లో మారిషస్‌లో ప్లాటెక్స్ అనే కంపెనీని పీవీపీ స్థాపించాడు... ఆర్థిక సంస్థల నుంచి 886 కోట్లు రుణంగా సమీకరించారు. ఆ సొమ్మును స్వదేశంలో ఉన్న తన లిస్టెడ్ కంపెనీ పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీలు న్యూ సైబరాబాద్ సిటీ ప్రాజెక్ట్స్, పీవీపీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి వాటికి తరలించారు. వీటితో పాటు వైఎస్ జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోనూ పెట్టుబడులు పెట్టారు. ప్రతిఫలంగా వైఎస్ హయాంలో పీవీపీ కంపెనీలకు భూకేటాయింపులు జరిగాయి.
పీవీపీ సంస్థ వార్షిక నివేదిక 2010-2011 రికార్డుల ప్రకారం...జగన్ మీడియాలో పెట్టుబడులపై సీబీఐ పీవీపీని ప్రశ్నించింది. ఆయన కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి పీవీపీ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది. అయితే పీవీపీ సంస్థ 2016-2017 వార్షిక నివేదికల ప్రకారం... జగతి పబ్లికేషన్‌లో పీవీపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 130.97 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఉంది. ఇంకో విషయం ఏంటి అంటే, పీవీపీ మారిషస్ లో తీసుకున్న రుణం ఎగ్గొట్టాడు... దీంతో, అప్పు ఇచ్చిన సంస్థల్లో భాగస్వామిగా ఉన్న సిటడెల్ ఈక్విటీ ఫండ్ లిమిటెడ్ మారిషస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అంగీకారం లేకుండా భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి... అక్కడి నుంచి థర్డ్ పార్టీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. మన దేశంలో సెబీ కూడా, పీవీపీ పై చర్యలు తీసుకుంది...నిబంధనలు అతిక్రమించడం, ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పీవీపీ లిస్టెడ్ కంపెనీ పాల్పడినట్లు నిర్దారించి సెబీ 30 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది... ఇది, పొట్లూరి వరప్రసాద్ విదేశాల్లో రుణం తీసుకుని, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల పెట్టి, దాని ఫలితంగా వైఎస్ పివిపికి చేసిన మేళ్ళు, స్పష్టంగా ప్యారడైజ్ పేపర్స్ గుట్టు రట్టు చేసింది... మన జగన్ గారు, ఇప్పుడేం అంటారో ?