కేంద్రం పదే పదే పెడుతున్న ఇబ్బందులతో, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపిక పై రాష్ట్రానికి, కేంద్రానికి దాదాపు యుద్ధమే నడుస్తుంది.. ఇది ఎటువైపు దారి తీస్తుందో అని పరిశీలకులు దగ్గర నుంచి చూస్తున్నారు... డీజీపీ ఎంపిక విషయంలో ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాని తిప్పి పంపించంది... మీ జాబితా ఒప్పుకునేది లేదు అంటూ, మొండికేసింది. యూపీఎస్సీ తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కేంద్రమే తీసుకుంటూ, రాష్ట్రాన్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిలో ఉంది...
మీకు ఫలానా వారు ఉండొద్దని చెప్పే అధికారం లేదు అంటూ కేంద్ర హోంశాఖకు లేఖలో ఏపీ స్పష్టం చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలుంటే యూపీఎస్సీకి చెప్పుకోవచ్చని లేఖలో సూచించింది. అయితే, అప్పుడు సరే అన్న కేంద్రం హోం శాఖ, ఈ నెల ఇరవై రెండో తేదీన డీజీపీ ఎంపిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ ఏ ఒత్తడి వచ్చిందో ఏంటో, రెండో రోజే రాష్ట్రానికి ఆ జాబితా తిప్పి పంపి, మీరు కొత్త పేర్లు ఇవ్వాల్సిందే అని చెప్పి, ఈ నెల 22న డీజీపీ ఎంపికపై నిర్వహించనున్న సమావేశాన్ని వాయిదావేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది... ఇప్పుడు చంద్రబాబు ఏమి చేస్తారా అని అధికార వర్గాలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి... రెండు సార్లు రాష్ట్ర జాబితా తిప్పి పంపటం అనేది చాలా అరుదు... మిత్ర పక్షంగా ఉండి కూడా, కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరి ఎందుకు తీసుకొందో అని ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నాయి... ఒక పక్క పోలవరంలో పేచీలు, భూ సేకరణ బిల్ తొక్కి పెట్టటం, అమరావతి అనుమతులు, ఇవన్నీ కేంద్రం కావాలనే రాజాకీయ కోణంలో చేస్తుంది అనే అనుమానాలు వస్తున్నాయి...
ఇన్చార్జ్ డీజీపీగా ఉన్న నండూరి సాంబశివరావును పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంటే, నిబంధనలు పేరుతో కేంద్రం తొక్కి పెడుతుంది... మరో పక్క అవే నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ఆదికారిని కొనసాగించడంలో లేని అభ్యంతరం ఏపీ ఆధికారి విషయంలోనే ఎందుకని కేంద్రాన్ని నిలదీసింది... ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటంతో కేంద్రం దిగి వచ్చింది...సరే అని ఇరవై రెండో తేదీన డీజీపీ ఎంపిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది... కాని రెండో రోజే , మళ్ళీ వెనక్కి తగ్గటం, జాబితా తిప్పి పంపటం, ఎందుకు జరిగాయి ? ఎవరి ఒత్తిడి ఉంది అనేది చంద్రబాబు ఆరా తీస్తున్నారు... మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి...