పట్టిసీమ ప్రాజెక్ట్ ఎంత విలువైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలిసిందే... ఈ ప్రాజెక్ట్ మొదట్లో, ఎన్నో సమస్యలు ఉన్నాయి... రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరిస్తూ వచ్చారు..... కాని ఆ సమస్యను వల్లభనేని వంశీ ఒక్క రోజులో పరిష్కారం అయ్యేలా చేశారు... అప్పుడు వంశీ ఆ చొరవ తీసుకోకపోతే, అసలు ఈ ప్రాజెక్ట్ ఇంత తొందరగా రికార్డు టైంలో అయ్యేదే కాదు... వంశీ చొరవను అందరూ అభినందిచారు... పట్టిసీమ విషయం వచ్చిన ప్రాతిసారి, ముఖ్యమంత్రి చంద్రబాబు వంశీని అభినందిస్తూనే ఉంటారు... అయితే, ఇవాళ పట్టిసీమ మీద అసెంబ్లీలో చర్చ సమయంలో వంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు...
పట్టిసీమ గురించి చంద్రబాబు పిలిచి చెప్పారని, రైతులని ఒప్పించి, ప్రాజెక్ట్ కి క్లియర్ చెయ్యమని చెప్పారని, అదే సందర్భంలో, సాక్షిలో పట్టిసీమ మీద కధనం చూసాను అని చెప్పారు... సాక్షిలో వచ్చిన కధనం చూసి, ఆ రోజు పట్టిసీమ అవసరం లేదనుకున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, పట్టిసీమ అవసరం ఏమిటో క్షేత్రస్థాయి పరిస్థితులను చూశాక అసలు విషయం తెలిసిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు భూసేకరణలో కీలకంగా పనిచేశామన్నారు. రైతులు కూడా అర్ధం చేసుకుని సహకరించారని, ఇప్పుదు బంగారం లాంటి పంట పండిస్తుంటే వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ఎంతో తృప్తిగా ఉంది అన్నారు...
గన్నవరం నియోజకవర్గంలోనే రూ.710 కోట్ల పరిహారం అందజేసిన విషయాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు 50 వేల ఎకరాలకు నీరు అందుతోంది.. అన్ని చెరువులు నింపుకుంటున్నామని ఎమ్మెల్యే వంశీమోహన్ అసెంబ్లీలో వివరించారు. అయితే సాక్షి కధనాలు వింటే ఎమ్మల్యే స్థాయి నాయకులు కూడా, నమ్మేస్తారు అంటే, ఆ సాక్షి పేపర్ కాని, టీవీ కాని ఎంత ప్రమాదమో అర్ధమవుతుంది... అందుకే ఆ సాక్షి చూడకుండా, వినకుండా ఉంటే మన ఆరోగ్యంతో పాటు, రాష్ట్రానికి కూడా మేలు చేసిన వాళ్ళమవుతాం... సాక్షి ఎలాంటి విషం చిమ్మే కధనాలు రాస్తుందో, ఇవాళ వంశీ మాటల్లో మరోసారి అర్ధమయింది...