జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ వ్యాఖ్యల పై, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు... వారసులను చూసి ప్రజలు ఓటేయరని నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఉన్న వారిని చూసి ఓటేస్తారని చెప్పారు. రాజకీయాల్లోకి వారసులు వచ్చిన మాట నిజమేనని, అయితే ప్రజామోదం ఉంటేనే ఆ వారసులు కూడా నిలబడుతారని, తాను కూడా అలాగే నిలబడుతానని పవన్ వ్యాఖ్యలకు స్పందించారు.. ఇప్పటికే పవన్ వారసత్వ వ్యాఖ్యల పై ఆయన మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి... సినిమాల్లో పవన్ ఎమన్నా కష్టపడి వచ్చాడా ? చిరంజీవిని పట్టుకుని వచ్చాడు.. సత్తా ఉంది కాబట్టి సినిమాల్లో నిలదొక్కుకున్నాడు, అందరూ అంతే అంటూ విమర్శలు వచ్చాయి...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై మాట్లాడుతుండగా కార్యకర్తలు, అభిమానులు లోకేష్ మంత్రి పదవి గురించి మాట్లాడాలని కోరారు.
"లోకేశ్‌కు అది వాళ్ల నాన్న చంద్రబాబు ఇచ్చిన స్టేటస్.. సీఎం తలచుకుంటే పదవులకు కొదవా" అని వ్యంగ్యంగా మాట్లాడారు.! " సీఎం వాళ్ల అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చుకున్నారు.. బహుశా లోకేశ్‌లో ఉన్న సామర్థ్యం చంద్రబాబు చూశారేమో... నాకైతే తెలియదు కానీ మా నాన్న అలా కాదు.. సాధారణ ఉద్యోగి’’ అని అని వ్యాఖ్యానించారు.