నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎయిర్ పోర్ట్ అయిన, గన్నవరం ఎయిర్ పోర్ట్ కి అంతర్జాతీయ హోదా వచ్చి కొన్ని నెలలు గడుస్తుంది... సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌, హాంగ్‌కాంగ్‌లకు సర్వీస్ లు నడపటానికి, ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు సర్వే చేసుకుని, సర్వీస్ లు నడపటానికి ముందుకు వచ్చాయి.... కాని, క్షేత్ర స్థాయిలో స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపటానికి ప్రధానంగా ఇమిగ్రేషన్‌ ఏర్పాటు జరిగి ఉండాలి. విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ ముస్తాబైంది. ఇమ్మిగ్రేషన్‌ బిల్డింగ్ కూడా రెడీ అయ్యింది... డీజీపీ సాంబశివరావు స్టాఫ్ ని ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు... అయితే ఇమ్మిగ్రేషన్‌ ఇంకా ఏర్పాటు కావాల్సిఉంది... 

gannavaram 09122017 2

కేంద్ర విమానయాన మంత్రి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా సారే, జాప్యం జరగటానికి మరేదో అడ్డు వస్తుంది అని అధికారులు అంటున్నారు... ఇమ్మిగ్రేషన్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రవీణ్‌ బోరాసింగ్‌ అనే ఉన్నతాధికారిణి నెల రోజుల క్రితం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చి అంతర్జాతీయ టెర్మినల్‌ను పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం, కౌంటర్లను కూడా పరిశీలించారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఆమె సానుకూలంగా రిపోర్టు ఇచ్చారు. మరో వారం రోజుల్లో పర్మిషన్ వస్తుంది అని అధికారులు ఆశించారు... అయినా ఇప్పటి వరకు రాలేదు...

gannavaram 09122017 3

ఒక వారం లోపు ఇమ్మిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ వెలువడితే, మిగిలిన ప్రక్రియ ప్రారంభమౌతుంది. జనవరి 15 నాటికి ఇమ్మిగ్రేషన్‌ రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ అనుమతి వస్తే, ముంబై - విజయవాడ - దుబాయ్‌ - షార్జా సర్వీసు నడపటానికి ఎయిర్‌ ఇండియి ఎక్స్‌ప్రెస్‌ రెడీ గా ఉంది... అధికారులు చెప్తున్న ప్రకారం జనవరి 15 నాటికి ఇమ్మిగ్రేషన్‌ కు అనుమతి వస్తే, జనవరి నెలాఖరు నుంచి, అంతర్జాతీయ సర్వీస్ నడపటానికి సిద్ధంగా ఉంది ఎయిర్‌ ఇండియి ఎక్స్‌ప్రెస్‌... ఇమ్మిగ్రేషన్‌ నుంచి అనుమతి రాకపోతే కేవలం ముంబై వరకు మాత్రమే విమాన సర్వీసును ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నడుపుతుంది. వచ్చిన తర్వాత ఆయా దేశాలకు నడుపుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read