ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు... దక్షిణ కొరియా పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి నిన్న మీడియాకి వివరించిన సందర్భంలో ఈ వ్యాఖ్యాలు చేశారు... కియ మోటార్స్‌ పెట్టుబడులు, ఉద్యోగావకాశాల పై మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు వోక్స్‌వ్యాగన్‌ ప్రస్తావన తెచ్చారు. ఆ రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆటోమొబైల్‌ రంగంలో బూస్ట్ తేవాలి అని ప్రయత్నించాను అని, అప్పుడే వోక్స్‌వ్యాగన్‌ కోసం ప్రయత్నాలు చేసింది గుర్తు చేశారు... తరువాత అధికారం పోవటం, తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ఆ కంపనీని ఎలా పోగొట్టుంది చెప్పారు...

cbn 08122017 2

వోక్స్‌వ్యాగన్‌తో ఆ రోజుల్లో సంప్రదింపులు జరిపామని తెలిపారు. అయితే వైఎస్‌ హయాంలో పారిశ్రామికవేత్తల్లో లేనిపోని భయాలు కల్పించారని, అక్రమాలు చేసేలా ప్రోత్సహించారని విమర్శించారు. వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ రాష్ట్రంలో రాకపోవటమే కాకుండా, వాటి ఫలితంగానే వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ డైరక్టర్లలో ఒకరు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కానీ దానికి కారణమైన నాయకుడు (బొత్సా సత్యన్నారాయణ) మాత్రం దర్జాగా కాలరెగరేసి తిరుగుతూ మా పై విమర్శలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ డైరక్టర్ జైల్లో కూర్చుంటే, అసలు అవినీతి చేసిన బొత్సా సత్యన్నారాయణ మాత్రం కారుల్లో హాయిగా తిరుగుతున్నారు అని ముఖ్యమంత్రి అన్నారు...

cbn 08122017 3

అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియ పరిశ్రమ వల్ల రూ.12915 కోట్ల(2 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల) పెట్టుబడి వస్తుందని, ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సీఎం తెలిపారు. కియ మోటార్స్‌కు భూమి, నీరు, అనుమతులు అత్యంత వేగంగా ఇవ్వడం కొరియా పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యపరిచిందన్నారు. దీంతో కియకు అనుబంఽధ పరిశ్రమలన్నీ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా 37 అనుబంధ సంస్థలు రూ.4,995.2 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయని తెలిపారు. కియతోపాటు 37 అనుబంధ సంస్థలతో కలిపి కొరియన్‌ టౌన్‌షిప్‌ని అనంతపురంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read