మంగళగిరి ఆటోనగర్ లో 2 ఐటీ సంస్ధలకు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు... అక్షర ఎంటర్ ప్రైజస్, కేజే సిస్టమ్స్ భూమిపూజ కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గున్నారు. మంగళగిరి ఐటి పార్క్ మధ్య, చిన్న తరగతి కంపెనీలకు వేదిక కాబోతుందని లోకేష్ అన్నారు.. మంగళగిరి ఐటి పార్క్ లో 10 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని, అమరావతిలో ఐటి రంగం అభివృద్ధి కి ముఖ్యమంత్రి  200 ఎకరాలు కేటాయించారని చెప్పారు..  2014 రాష్ట్ర విభజన జరిగిన నాటికి మనకి రాజధాని కూడా లేదు, పరిపాలన ఎక్కడ నుండి ప్రారంభించాలో కూడా తెలియని పరిస్థితి కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని లోకేష్ చెప్పారు. సాదారణ ఐటి కంపెనీలు కాకుండా ఫింటెక్,బ్లాక్ చైన్ టెక్నాలజీ,సైబర్ సెక్యూరిటి సేవలు అందిస్తున్న కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని చెప్పారు...

mangalagiri 24112017 2

6 నెలల్లోనే సచివాలయం నిర్మించుకున్నాం, విభజన జరిగిన తరువాత ఐటి రంగం మొత్తం హైదరాబాద్ లోనే ఉంది, అప్పటికి కేవలం కొన్ని చిన్న ఐటి కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, పోయిన మూడు ఏళ్లలో ముఖ్యమంత్రి గారి కష్టం వలన అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని లోకేష్ చెప్పారు... లోకేష్ మాట్లాడుతూ, మంత్రి అయ్యిన వెంటనే ఐటిలో 2019 కి లక్ష ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను 2019 కి ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు...

mangalagiri 24112017 3

ఐటి రంగంలో కేవలం పెద్ద కంపెనీలే కాదు మధ్య,చిన్న తరగతి కంపెనీలు కూడా ముఖ్యమని చెప్పారు... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉందన్నారు.. అందుకే కియా,హోండా,అపోలో టైర్స్ లాంటి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర విభజన సమయానికి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మన రాష్ట్రంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదని, కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారు అవుతున్నాయన్నారు. 2019 నాటికి దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 5 ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారు చేసేలా ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని అభివృద్ధి చెయ్యబోతున్నామని చెప్పారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read