పాపం ఈ కేరళా వాళ్లకి, చంద్రబాబుకి కులం ఆపాదించటం తెలీదు, చంద్రబాబు సైకిల్ పార్టీ వాడని తెలీదు.... కాని చంద్రబాబు విజన్ తెలుసు, చంద్రబాబు సమర్ధత తెలుసు, చంద్రబాబు ఈ దేశంలో గౌరవించదగ్గ నాయకుడు అని మాత్రమే తెలుసు... అందుకే గౌరవార్ధం చంద్రబాబు పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు... కేరళ సూపర్ స్టార్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపీ మన ముఖ్యమంత్రికి ఇచ్చిన గౌరవం ఇది... అంతె కాదు మన అమరావతిని, పొగిడారు కూడా...
ఇవాళ మలయాళ హీరో సురేష్ గోపి అమరావతి వచ్చారు... వెలగపూడి సచివాలయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబుటి భేటి అయ్యారు.. కేరళలో జరిగే జాతీయ బానానా ఫెస్టివల్ కు సియం చంద్రబాబు ఆహ్వనించారు హీరో సురేష్ గోపి.. 2018 ఫిభ్రవరి 17 నుండి 21వరకు తన సొంత గ్రామం కల్లియార్ గ్రామం త్రివేండ్రంలో జరుగుతున్నందున తప్పకుండా రావాలని చంద్రబాబును కోరారు... ఈ ఫెస్టివల్ కు జాతీయ స్థాయిలో విద్యార్థులు, శాస్త్రవేతలు,అరటి రైతులు పాల్గుంటున్నారని చెప్పారు... కల్లియార్ గ్రామ పంచాయతీ, కేంద్ర, రాష్ట్ర సంస్థల భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ సోషల్ యాక్షన్(సీఐఎస్ఎస్ఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది...
దేశంలో అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది... ఇందుకోసమే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పాల్గన్నాలని ఆహ్వానించటానికి ఇక్కడ వరకు వచ్చానని చంద్రబాబుతో చెప్పారు... ఈ ఫెస్టివల్ లో 457రకాల అరటి ఉత్పత్తులు ప్రదర్శనకు రానున్నాయని చంద్రబాబుకి వివరించారు... మొదటిసారిగా అమరావతికి రావడం చాలా ఆనందంగా ఉందని, అమరావతి చూడటానికి ప్రకృతి వనంలా ఉందని, మలయాళ హీరో సురేష్ గోపి అన్నారు... అయితే సురేష్ గోపి, వెళ్ళేటప్పుడు, గౌరవార్ధం చంద్రబాబు పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు...