ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కలిపించటం కోసం, కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని చోట్ల కనెక్షన్ లు కూడా ఇస్తున్నారు... వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం మొత్తం, ఈ కనెక్షన్ లు ఇవ్వనున్నారు... ఇప్పటికే రాష్ట్రం మొత్తం ఫైబర్ గ్రిడ్ కేబుల్ కూడా పెట్టారు... అయితే, ఎవరు కన్ను కుట్టిందో కాని, ప్రజలకు తక్కువ ధరకే కేబుల్ టీవీ, అంతర్జాలం, ఫోన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థకు తలనొప్పలు ఎదురవుతున్నాయి.
మొత్తం 2 వేల కిలోమీటర్ల మేర కేబుళ్లను ఈ సంస్థ అమర్చింది. కొన్ని వేల ఇళ్లకు కనెక్షన్ ఇచ్చింది. ఇప్పడు ఈ కేబుళ్లను కొందరు దొంగలు కత్తిరించేస్తున్నారు. కడప జిల్లా కేతవరం వద్ద ఒక జంక్షన్ బాక్సును ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా గాండ్లపర్తిలో కేబుళ్లను తెంచేశారు. ఆర్నెల్లలో ఇలాంటివి 120కిపైగా నమోదయ్యాయి. ఒక్కసారి కేబుల్ను కత్తిరిస్తే దాన్ని సరిచేసి ప్రసారాలు పునరుద్ధరించడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయం పై ఫైబర్నెట్ సీఈవో ఎ. బాబు డీజీపీ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. ఫైబర్నెట్ రాష్ట్ర ఆస్తి కాబట్టి దాన్ని ఎవరు కత్తిరించినా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ ఫైబర్ నెట్ మీద కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి... ఈ ప్రాజెక్ట్ ఆపెయ్యాలి అని, కోర్ట్ లో కేసులు కూడా వేసాయి... అయితే వీళ్ళ కుట్రలని కోర్ట్ తిప్పి కొట్టింది... ఇప్పుడు ఇలా కొంత మంది వైర్లు కట్టిరేస్తున్నారు... చాలా వరకు స్థానిక కేబుల్ ఆపరేటర్లకే ఈ ఫైబర్ నెట్ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి, వారి వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు... మరి, వైర్లు కత్తిరించాల్సిన అవరసరం ఏముంది ? దీనిలో రాజకీయ కోణం ఉందా అన్న విషయం కూడా దర్యాప్తు చేస్తున్నారు...