ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, తరువాత సాక్షి అవే మాటలు అందుకుని కట్టు కధలు అల్లటం... ఇది వరస... రాజకీయంగా ఎన్నో మాట్లాడవచ్చు కాని, మనమే స్వయంగా అందులో ఉండి, ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటూ కూడా, అబద్ధాలు ఆడితే ఎలా ? ఇక్కడ ఉంది చంద్రబాబు హైటెక్ ప్రభుత్వం... చేస్తుంది రియల్ టైం పరిపాలన... రాష్ట్రంలో ఏమి జరిగినా నిమిషాల్లో సియం డ్యాష్ బోర్డు లో అప్డేట్ అయిపోతూ ఉంటుంది... పాదయాత్రలో ఉన్న జగన్, ఇలాగే అబద్ధాలు ఆడుతూ దొరికిపోయారు... రాష్ట్రంలో ఎక్కడా ఎన్టీఆర్ వైద్యసేవలు అందడం లేదని రాష్ట్రం అనారోగ్యప్రదేశ్గా మారిందని జగన్ అన్నారు...
కాని వాస్తవానికి, పులివెందులలో జగన్ కు పిల్లనిచ్చిన మామ, శ్రీమతి వైఎస్ భారతి తండ్రి, డాక్టర్ ఇసి గంగిరెడ్డి ఆసుపత్రిక, దినేష్ నర్సింగ్ హోంకు, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం వాస్తవం కాదా ? జగన్ మామ ఆసుపత్రిలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 198 మంది కి ఎన్టీఆర్ వైద్యసేవ క్రింద చికిత్స చేశారు. దీనికి గాను చంద్రబాబు ప్రభుత్వం వారికి 4941477 రూపాయల డబ్బులను ప్రభుత్వం వారి ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఇవి అయితే జగన్ మాత్రం, ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు...
అయ్యా జగన్ గారు, ఈ లింక్ లో రియల్ టైం డేటా అప్డేట్ అవుతుంది... ఇక్కడకు వెళ్లి చూడండి, ఎన్టీఆర్ వైద్యసేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అందుతున్నాయో తెలుస్తుంది... మీకు అర్ధంకాక పొతే , మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన ప్రశాంత్ కిషోర్ ని చూడామని అడగండి... ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు... అంతే కాని, మీ సొంత మామ హాస్పిటల్ లోనే ఎన్టీఆర్ వైద్యసేవలు అందిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం దగ్గర మీ సొంత మామకే డబ్బులు ఇప్పించుకుంటూ, అబద్ధాలు చెప్తే, ప్రజలు హర్షించరు... http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/HealthFamilyWelfare/NTRVaidhyasevaMainReport.aspx