ఒక పక్క పోలవరంతో చంద్రబాబుని ఇబ్బంది పెడదాం అనుకున్న కేంద్రం, ఊహించని చంద్రబాబు రియాక్షన్ తో తానే ఇరుకునపడింది... మరో పక్క కాపు రిజర్వేషన్, అంశం కూడా వేడిలో వేడి అన్నట్టు, చంద్రబాబు అది కూడా కేంద్రం కోర్ట్ లోకి నెట్టారు... పోలవరం ఒత్తిడిలో, కాపు రిజర్వేషన్ కూడా ఆమోదం పొందే ప్రయత్నం చేశారు... ఇది ఇలా ఉండగానే, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు రంగంలోకి దిగారు.... చంద్రబాబుకి తోడయ్యారు... విశాఖ రైల్వేజోన్‌ అంశం ఏమైంది అంటూ, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేటు బిల్ పెట్టటానికి సిద్ధం అయ్యారు....

rammohan 04122017 2

విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు పై బిల్లు పెట్టేందుకు అంగీకరిస్తూ రామ్మోహన్‌నాయుడుకు లేఖ అందింది. లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రామ్మోహన్‌ నాయుడు స్పీకర్‌కు లేఖ పంపారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనకు తాజాగా సమాచారం పంపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. రైల్వేజోన్‌ చట్టం -2017 పేరుతో ప్రతిపాదించేందుకు లోక్‌సభ సచివాలయం అంగీకారం తెలిపింది.

rammohan 04122017 3

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్లను కలిపి జోన్‌ ఏర్పాటుకు బిల్లు పెట్టనున్నారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టనుంది. ఈ బిల్ విషయంలో కేంద్రం వైఖరి తెలిసిపోనుంది... ఒక్క దెబ్బతో, అటో ఇటో తెల్చేయ్యటానికి ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో, రామ్మోహన్‌నాయుడు సరైన టైంలో స్పందించారు... కేంద్రం వైఖరి ఈ విషయంలో ఏంటో తెలిసిపోనుంది... ఇప్పటి వరకు ఏమి చేశారు అనే విషయాలుతో పాటు చెప్తూ, అవునో కాదో కేంద్రం తెల్చేయనుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read