ఇటీవలే జగన్ పెడుతున్న టార్చర్ భరించలేక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంత నీచ్చంగా అవమానించింది, ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు... ‘మేము మాటకి కట్టుబడి ఉండే మనుషులం. నేను టీచర్ ని, మా నాన్న అప్పలనాయుడు ఎక్స్ ఎమ్మెల్యే. మేము ఎవరికైనా సహాయం చేసే మనుషులం. ముఖ్యంగా కష్టజీవులం. అయితే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అనంటే... వైఎస్ జగన్ మాటతప్పడం వల్ల. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నన్ను దూషించడం వల్ల. ఇడుపులపాయలో ఆయన నన్ను దూషించారు.

jagan eswari 05122017 2

‘కుంభా రవిబాబు, పసుపులేటి బాలరాజు వంటి లీడర్స్ ని పార్టీలోకి తీసుకోకండి. వాళ్లు నాన్ లోకల్ ట్రైబ్స్' అని చెప్పాను. దీంతో 'దానితో నీకేం సంబంధం. నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు?' అని జగన్ అడిగారు. అంతే కాకుండా 'కుంభా రవిబాబు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి ... ఇతర విషయాలు నీకెందుకు?' అని జగన్ అన్నారు. దీంతో అన్నా ఇది మీకు భావ్యం కాదు అని బతిమాలితే.. 'ఇలాంటి సోది మాట్లాడవద్దు..ఇలాంటి పంచాయతీ నాకు వద్దు, నేను కాబోయే ముఖ్యమంత్రిని' అని వెళ్లిపోయారు. దీంతో నేను షాక్ తిన్నాను’ అని ఈశ్వరి తెలిపారు... జగన్ లోని అపరచితుడుని అప్పుడే చూసాను అని అన్నారు... అందరూ అంటూ ఉంటే అప్పుడు తెలవలేదు, కాని నా దాకా వచ్చే సరికి జగన్ స్వభావం అర్ధమైంది.. ఏదో ఒక రోజు, ఆ పార్టీలో అందరికీ తెలుస్తుంది అని అన్నారు...

jagan eswari 05122017 3

వైయస్సార్సీపీలో ఉన్న ఇంకో రూల్ ఏంటంటే.. టీడీపీ వైపు చూడకూడదు. ఏ పని ఉన్నా అక్కడి నేతలు లేదా మంత్రులతో మాట్లాడకూడదు. ఆ పార్టీకి మద్దతిచ్చే ఏ అధికారుల దగ్గరకు వెళ్లకూడదన్న రూల్స్ కూడా ఉన్నాయి. అందుకని మాకేమీ తెలియదు. నిజానికి సచివాలయం కూడా ఎలా ఉంటుందో తెలియదు. రెండు రోజుల నుంచి సచివాలయానికి వెళ్తుండడంతో అదెలా ఉందో తెలుస్తోంది. ఒకవేళ పొరపాటున అటువెళ్తే...మనం ఏదో తప్పుచేసిన వాళ్లులాగా ఉండాలి. పార్టీలో ఇతరులు కూడా అలాగే చూస్తారు. 'ఏంటమ్మాయ్! ఆ మంత్రి దగ్గరకి వెళ్తున్నావేంటి?' అని అడిగేవారు' అని గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఉప్పులేటి కల్పన, వంతల రాజేశ్వరి వైసీపీని వెళ్లినప్పుడు అర్థం కాలేదని, ఇప్పుడే అర్థమైందని చెప్పారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read