తమ్మారెడ్డి అనే ఒక హైదరాబాద్ నివాసి తెగేసి చెప్పారు... సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వచ్చే ఉద్దేశం కానీ, రావాలనే కోరిక కానీ లేదంట. హైదరాబాద్ లో, కెసిఆర్ సేవలో చలా హాయిగా ఉన్నారు అంట... అసలు మేము ఆంధ్రాకు ఎందుకు రావాలి అంటూ అడుగుతున్నారు. సూపర్ డైలాగ్ అదిరింది... ఇంతకీ తమ్మారెడ్డీ నిన్ను రమ్మని ఎవరు అడిగారు...? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను రమ్మని ఏమన్నా అడుక్కున్నారా తమ్మారెడ్డి ? అసలు మీ బుద్ధి ఎలా ఏడ్చింది అంటే, తినేది ఇంటిమొగుడు సొమ్ము, పాడేది రంకుమొగుడు పాట అనే సామెత లా ఉంది... మీ సినిమాల కలెక్షన్ లో 70% వచ్చేది మా రాష్ట్రం నుంచి, మీకు మాత్రం మా రాష్ట్రం అంటే చిరాకు..
అసలు అన్నిటికంటే ముందు, నువ్వు మా రాష్ట్రం గురించి మాట్లాడే ముందు నీకు ఒక ప్రశ్న ? ఏ నాడైనా మా రాష్ట్రం విడిపోతున్నప్పుడు మాట్లాడవా ? విభజన హామీలు, హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తులు గురించి మాట్లాడావా ? పోనీ నువ్వు మా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి, ఏ నాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా ఎలా విస్తరించాలో చెప్పావా ? మీరు, మీ హైదరాబాదుకే పరిమితమైన నీ తోటి సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి ఊడపీకారో సెలవిస్తే విని తరిస్తాము....
అసలు ఇండస్ట్రీలో ప్రస్తుతం నువ్వు హీరోవా, విలనా, డైరెక్టరా, నిర్మాతవా, అసలు చిన్న జూనియర్ అర్టిస్ట్ కూడా కాదు... సినిమాపేరు చెప్పుకుని బ్రతికేస్తున్న వాడివి... యూట్యూబ్ వీడియోల్లో, ముదనష్టపు టివి ఛానళ్ళలో పాపిష్టి డిబేట్లలో మురికి చర్చల్లో తప్పితే, నువ్వు ఈ మధ్య పెద్దగా పొడిచింది లేదు... నువ్వు తెలుగు సినిమా ప్రతినిధిలా బిల్డ్ అప్ ఇస్తుంటే, మీ హైదరాబాద్ లో కూర్చున్న సినిమా వాళ్ళే నవ్వుతున్నారు... సర్లే నీ లాంటోడు మా రాష్ట్రానికి అవసరం లేదులే కాని, పోయి కెసిఆర్ భజన చేసుకో... ఇలాంటి పిచ్చ కూతలు కూస్తారనే, ఇక్కడ ఆధర్ కార్డు తీసుకుని, వాగమని చెప్పింది...