ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసంధాన స్వప్నం మరోసారి సాకారమయ్యింది. గోదావరి నది ఎడమగట్టు పై తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఎట్టకేలకు గోదావరి నదీ జలాలు ఏలేరుతో అనుసంధానమయ్యాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం ద్వారా ఈ ప్రక్రియ సాకారమైంది. గోదావరి నది నీటిని ఎత్తి ఏలేరు రిజర్వాయర్ లో పోసే ప్రకరియ విజయవంతమయ్యింది. ఈ ఏడాది ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. సరిగ్గా వంద రోజుల ఆనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ -2 నుండి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్ కు పంపించడం పూర్తయ్యింది. ఇప్పటికే స్టేజ్-1 నుండి నీటిని తోడుతున్నప్పటికీ, ఏలేరుకు అనుసంధానం కాకుండానే నేరుగా ఆయకట్టుకు సరఫరా చేస్తున్నారు.

eleru 04122017 2

గోదావరి, ఏలేరు నదుల అనుసంధానం సత్ఫలితానికి ఈ చిత్రం నిదర్శనం. గతేడాది ఇదే సమయానికి జలాశయంలో చుక్క నీరు లేదు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి పైపులైను ద్వారా గోదావరి నీరు జలాశయంలోకి చేరుతోంది. దీని కింద నున్న 67 వేల ఎకరాలకు రబీ పంట కోసం 6 టీఎంసీల నీరు అవసరం. కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీరుంది. దీంతో రైతులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుని విజనరీ నాయకుడు అనేది...

eleru 04122017 3

ఏలేరుకు నీటిని తీసుకువెళ్లేందుకు రెండు దశల్లో పంపుహౌస్‌ నిర్మాణం చేపట్టారు. గోదావరి వద్ద 10 పంపులు, 10 మోటార్లతో మొత్తం 3,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా తొలిదశ పంపుహౌస్‌ నిర్మాణం చేపట్టారు. రెండో దశలో 8 పంపులు, 8 మోటార్లతో 1,300 క్యూసెక్కులు నీటిని తీసుకువెళ్లేలా రెండో పంపుహౌస్‌ పనులు 2017 జనవరి నెలాఖరులో ప్రారంభమయ్యాయి. తొలి పంపుహౌస్‌ వద్ద 8 పంపులు, మూడు మోటార్లు బిగించారు. మూడు పంపుల ద్వారా మొత్తం 1,050 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అక్టోబరు 25న ఎడమ కాలువ నుంచి నేరుగా ఏలేరు ఆయకట్టకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాలువ 50వ కిలోమీటరు వద్ద రెండో పంపుహౌస్‌ నుంచి గోదావరి నుంచి తొలి పంపుహౌస్‌ ఎత్తిపోతల ద్వారా వచ్చిన నీటిని ఎత్తిపోసి ఏలేరుకు పంపే ప్రక్రియ చేపట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read