250 కోట్లు కాంట్రాక్టు కుదుర్చుకుని, తనని ముఖ్యమంత్రిని చెయ్యటం కోసం తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు, జగన్ కి పెద్ద గుది బండలా తయారయ్యాడు అని, వైసిపీ పార్టీలో కింద స్థాయి నుంచి, పై దాకా చెప్తున్నా, జగన్ కు మాత్రం ఎక్కటం లేదు... మీరు ఎవరూ లేక పోయినా పరవాలేదు, నాకు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అంటూ గుడ్డిగా నమ్మేస్తున్నాడు... మొన్నటి వరకు కొద్దో గొప్పో జగన్ కు వైటేజి ఉండేది... ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాడో, జగన్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది... మొదటి అసైన్మెంట్ అయిన నంద్యాల ఘోరంగా ఓడిపోయినా, జగన్ మాత్రం పీకే మీద నమ్మకాన్ని వదల్లేదు...

pk 04122017 2

ప్ర‌శాంత్ కిషోర్ తీసుకునే నిర్ణయాలతో పార్టీకి లాభం కంటే న‌ష్టమే ఎక్కువు జ‌రుగుతుంద‌ని వైసీపీ నేత‌లు వాదిస్తున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ ఎత్తుగడలతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు పార్టీ ఫిరాయిస్తున్నారని చెబుతున్నారు. జగన్ కు ప్ర‌శాంత్ కిషోర్ గురించి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంద‌ని సీనియ‌ర్లు వాపోతున్నారు. జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు అని, అందుకే పీకే జపం తప్ప వేరేది చెయ్యటం లేదు అంటున్నారు.. పీకే సర్వే అంటూ జగన్ దగ్గరకి రావటం, ఈ సిట్టింగ్ ఎమ్మల్యే, ఎంపి మార్చమనటం, జగన్ ఫాలో అయిపోవటం, రెండు సంవత్సరాల ముందే వారిని టార్గెట్ చెయ్యటం, వారు వెళ్ళిపోవటం... క‌ర్నూల్ ఎంపి బుట్టా రేణుక విషయంలో, రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి, జ‌గ‌న్ కు వీర విధేయురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి కూడా ప్రశాంత్ కిషోర్ పెట్టిన చిచ్చే అని, సీనియర్లు అంటున్నారు...

pk 04122017 3

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు కొన్ని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌లు కూడ తట్టబుట్ట సర్దుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది... చివ‌రి నిమిషంలో జ‌గ‌న్ టికెట్ నిర‌ాకరిస్తే వెళ్ల‌డం కంటే ముందే టీడీపీలో క‌ర్చిఫ్ వేసుకోవ‌డం మంచిద‌న్నభావనలో వైసీపీ నేత‌లు ఉన్నారు... కొంప తగ్లబడుతున్నా, మా ఓడు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడు, ఆయనతో పాటు ఉంటే, మేము తగలబడతాం, కాని మా ఖర్మకి చంద్రబాబు మమ్మల్ని రానివ్వటలేదు, తప్పక ఇక్కడ ఉంటూ, ఈ కామెడీ సినిమా చూడాల్సి వస్తుంది, నేనేటి చేసేది అంటూ, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి... జగన్ అయితే మారే ప్రసక్తే లేదు, పీకే మాటే వేదం, మా దారి మేము చూసుకోవాల్సిందే అంటున్నారు మిగతా నేతలు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read