సరిగ్గా టైం కోసం ఎదురు చూస్తున్న కెసిఆర్, హైదరాబాద్ లో ఉన్న సీమంధ్ర ప్రజల పై భారీ దెబ్బ వేశారు అని అంటున్నారు అక్కడి ఆంధ్రా వారు... వందలు, వేలు కాదు, ఒక్క హైదరాబాద్ సిటీ, చుట్ట పక్కల కలిపి, ఒక్క దెబ్బకు 25 లక్షల ఓట్లు లేపెసారని అంటున్నారు... దీంట్లో, అప్పటి ఎన్నికల అధికారిగా ఉన్న భాన్వర్ లాల్ హస్తం కూడా ఉందేమో అని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి... ఎక్కడైనా ఇళ్ళకి తాళాలు వేసి ఉంటే వందల్లో ఓట్లు పోతాయి, మహా అయితే కొన్ని వేలల్లో ఉంటాయి, అలాంటికి 25 లక్షలు ఓట్లు పోవటం అంటే, అది కచ్చితంగా అధికారంలో ఉన్న వారు చేస్తేనే అయ్యే పని అంటున్నారు...

kcr 05122017 2

ముఖ్యంగా ఆంధ్రా వారు ఎక్కువ ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓట్లు పోయాయి అని అంటున్నురు... రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని, 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికి సర్వే చేపట్టింది. జీహెచ్‌ఎంసీలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఇతర నియోజకవర్గాలు, రెండు గ్రామీణ నియోజకవర్గాలను తీసుకొని ఓటర్ల జాబితా ప్రకారం సర్వే చేశారు. ఈ సర్వే ప్రకారం 24లక్షల 20వేల 244 ఓట్లు తొలగించారు అధికారులు. కొత్తగా 5,82,138 ఓట్లు నమోదయ్యాయి. అయితే స్థానికులు మాత్రం, ఎవరూ మా ఇళ్ళకి సర్వేకి రాలేదు అని చెప్తున్నారు...

kcr 05122017 3

ఇటీవల హైదరబాద్ రోడ్లు కాని, అక్కడ వసతులు, ట్రాఫిక్ ఇలా అన్ని విషయాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. వర్షాలు పడితే, ఎలాంటి నరకమో, మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం... హైదరాబాద్ లో సగానికి పైగా ఆంధ్రా జనాభానే ఉంటుంది... ఎక్కువుగా అక్కడ సెటిల్ అయిపోయారు... వారంతా హైదరాబాద్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు... కెసిఆర్ ఇంత బలంగా ఉన్నా, హైదరాబాద్ విషయంలో మాత్రం చేతులు ఎత్తేసారు... ఎక్కవ సీట్లు అక్కడ తెలుగుదేశం గెలిచింది... ఇప్పుడు అంతా తెరాసాలోకి వెళ్ళిపోయారు అనుకోండి... ఆంధ్రా వారు ఎప్పటికైనా ఇబ్బంది అనుకున్నారో ఏమో కాని, కుట్ర ప్రకారం 25 లక్షల ఓట్లు ఒక్క సిటీలో తెసేసారు అని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి.... ఇంట పెద్ద ఎత్తున జరిగిన విషయం మీద, ఎన్నికల సంఘం స్పందించాలి అని, మొత్తం మరోసారి సమీక్షంచాలి అని అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read