పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ టెండర్లు ఆపేయమని కేంద్రం నుంచి ఉత్తరం రావటంతో, రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగింది... మొన్న కాఫర్ డ్యాం ఆపెయ్యమన్నారు, ఇప్పుడు ఇదేంటి అంటూ, కేంద్రం పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు... దీని పై ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్త్యం చేస్తూ, ఇలాగే ఇబ్బంది పెట్టాలి అనుకుంటే, మీకొక నమస్కారం పెట్టి, మీకే ఇచ్చేస్తా, 2019లోపు పూర్తి చేసి ఇవ్వండి అంటూ, అసెంబ్లీ సాక్షిగా అన్నారు... దీని పై బీజేపీ నాయకుడు సోము వీర్రాజు, వీర ప్రతాపం చూపించారు... ముఖ్యమంత్రిని జైలులో పెడతాం అని కూడా అన్నారు... ఆ ఉత్తరం రాసింది ఒక అధికారి అంట, దానికి కేంద్రానికి సంబంధం ఏంటి అని అన్నారు...ఒక అధికారి అత్యుత్సాహంతో చేసిన పనికి, మా మీద నిందలా అంటూ సోము వీర్రాజు విర్రవీగారు...
అయితే, వాస్తవం వేరేలా ఉంది.. పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక టెండర్లకు అడుగోడ కట్టిందెవరు? ఇదంతా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ వ్యవహారమే అని, కేంద్ర మంత్రి గడ్కరీకి తెలియకపోవచ్చునని ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. అయితే. గడ్క రీకి తెలిసే ఇది జరిగిందన్నది తాజా సమాచారం. కాంక్రీట్ పనుల కోసం విడిగా పిలిచిన టెండర్లను ఆపాలంటూ గడ్కరీ ఆమోదం మేరకే అమర్జిత్ సింగ్ లేఖ రాశారని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖలో ప్రాజెక్టుల విభాగం కమిషనర్ వోరా స్పష్టం చేశారు.
రాష్ట్ర జల వనరుల శాఖ వోరాను కొన్ని వార్తా పత్రికలు సంప్రదించినప్పుడు ఈ అంశం స్పష్టమైంది. పోలవరం ప్రధాన కాంట్రాక్టరు ట్రాన్ స్ట్రాయ్ నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే 60-సీ కింద నోటీసును ఇచ్చిన విషయాన్ని వోరాకు రాష్ట్రం స్పష్టం చేసింది. కాంట్రాక్టు సంస్థ అంగీకరిస్తేనే విడిగా టెండర్లు పిలవాలనడం పై విస్మయం వ్యక్తం చేసింది. ఏ కాంట్రాక్టు సంస్థయినా తనను తప్పించి వేరే సంస్థకు అవకాశం ఇవ్వాలంటుందా అని ప్రశ్నించగా, వోరా బదులివ్వలేదు. మరి ఈ పరిణామాల పై మన వీర్రాజు గారు, ఏమి సమాధానం చెప్తారో... ఎవరిని జైల్లో పెడతారో..