పట్టిసీమ ఎత్తిపోతల గత ఐదు నెలల నుంచి నిరాఘాటంగా గోదావరి జలాలు ఇస్తుండడంతో కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి కొరత తీరింది. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణా డెల్టాకు చేరడంతో నాలుగు జిల్లాల్లో ఖరీఫ్ సీజను గట్టెకింది... రైతుల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది... పొలాల్లో నిండుగా పెరిగిన వరి పంట మూలంగా అధిక దిగుబడులు వస్తాయని రైతులు మురిసిపోతున్నారు... ఇప్పటికే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రైతులు వరి పంట కోతకు సిద్ధమవుతున్నారు... ఇప్పటికే వరి పంటను నూర్చిన రైతుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.. గతం కంటే వరి దిగుబడులు అధికంగా ఉండటంతో ఉబ్బితబ్బవుతున్నారు... అయితే, గోదావరిలో ఇన్ ఫ్లో తగ్గటంతో పట్టిసీమ మోటార్లు ఆపేశారు...
పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మోటార్లను మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేసినట్టు పోలవరం ఎస్ఈ విఎస్ రమేష్ బాబు తెలిపారు... ఎత్తిపోతల పధకంలోని 24 మోటార్లను జూన్ 18న ఆన్ చేసి రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించారు. ఇప్పటివరకు 105.8 టిఎంసీల నీటిని తరలించారు. కాగా గోదావరి నదిలో ఇన్ ఫ్లో తగ్గడంతో నీటిమట్టం ఆధారంగా మోటార్లను నిలిపివేశామని చెప్పారు. గత ఏడాది జూన్ నెలలో ఎత్తిపోతల పధకంలోని మోటార్లను ఆన్ చేసి డిసెంబర్ అయిదు వరకు 55.59 టీఎంసీల నీటిని కృష్ణా డెల్లాకు తరలించారు. గత ఏడాది భారీ వర్షాలతో మధ్యలో ఎక్కువ రోజులు మోటార్లను నిలిపివేశారు. ఈ ఏడాది రెండు రోజులు మాత్రమే మోటారు ఆపి సుమారు 150 రోజులకు పైగా మోటార్లను ఆన్ చేసి రికారు స్థాయిలో నీటిని తరలించారు. తక్కువ సమయంలో వంద టీఎంసీల నీరు కృష్ణా డెల్లాకు తరలించడం వల్ల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా పట్టిసీమ ఎక్కింది...
రైతులు ఇంత సంతోషంగా, మా కన్నీళ్లు పట్టిసీమ తీర్చింది అని మురిసిపోతుంటే, రాష్ట్రంలో కొంత మంది మాత్రం పట్టిసీమ నీటిని చూసి, కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నారు... వారి కన్నీళ్లు లెక్కేస్తే, పట్టిసీమ ప్రవాహం కంటే ఎక్కువే ఉంటుంది ఏమో.... కళ్ళ ముందు పచ్చని పైరులు కనిపిస్తున్నా, ఇప్పటికీ పట్టిసీమ దండగ అనే వాదిస్తున్నారు.... వారి సొంత పత్రికల్లో, టీవీల్లో ఇప్పటికీ పట్టిసీమ మీద విషం చిమ్ముతూనే ఉన్నారు.... రైతులు మాత్రం, ఆ ఏడుపులు ఉంటేనే నయం అని, మా పచ్చని పొలాలకు జీవం పోస్తున్న పట్టిసీమకు దిష్టి పోతుంది అని అంటున్నారు...