జాతీయ స్థాయి నాయకత్వం మరియు సుధీర్ఘ రాజకీయ అనుభవంతో, జాతీయ స్థాయి ప్రాజెక్టు అయినా... ప్రాజెక్టు రిపోర్టులు తయారు చెయ్యడం, అంచనాలు తయారు చెయ్యడం, డిజైన్లు దశకు వచ్చే సరికి దశాబ్దాలు అవ్వడం, మళ్లీ అంచనాల నుండి మొదలెట్టడం... ఇదే దేశంలో జరిగేది... మధ్యలో ప్రభుత్వాలు మారతాయి.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకొంటారు. అందుకే, జరిగే జాప్యం తనకు తెలుసు, ఈ వయసులో, తన పని కాదని తెలిసీ.. తనతోనే ఈ పని అవుతుంది అని తెలిసి... ఓ కూలీగా మారాడు.. రాష్ట్ర ఎనిమిది దశాబ్దాల కల పోలవరాన్ని తన చేతుల మీద.. తన రాజకీయ జీవిత కానుకగా ఇద్దామనుకొని చంద్రబాబు గారు.. కాని 2010 వరకు 2932 కోట్లు వ్యయ అంచనాగా వున్న భూసేకరణ భారం.. ఈరోజు 10 రెట్లకు పైగా పెరిగి 33858 కోట్లుగా పెరిగింది కొండలా.. అయినా దిగాక లోతు చలి చూసి విదుల్చుకొని వెళ్లిపోయే కూలీ కాదు బాబు గారు... విభజనతో నెత్తిన పెట్టిన అప్పులు లోటు బడ్జెట్... అన్నదాతలకు అందించాల్సిన రుణమాఫీ... అయినా సర్దాడు ఏడువేల కోట్లకు పైగా... కూలీ దగ్గర లెక్క చెప్పించుకొని.. తొమ్మిది విడతలుగా ఇచ్చింది నాలుగు వేల కోట్లు... అందులో ఓ విడత కూలీ మనసు ఎంత నొచ్చుకొంటుందో... అనే కనీస స్పృహ లేకుండా ఒకటిన్నర కోటి విదిల్చింది కేంద్రం... అవమానం ఆక్రోశం పరీక్ష సహనం నశించే... సుధీర్ఘ అనుభవ నాయకుడు గా కాకుండా... రాష్ట్ర కూలీ కాబట్టి భరించాడు... ఇంకా సర్దిందే రావాల్సింది మూడువేల కోట్లకు పైగా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఓ ప్రాజెక్టు దగ్గరకి వెళ్లని విధంగా, చలి ఎండ వాన కాలాలు చూడని కూలీగా, 24 సార్లు వెళ్లాడు... బురదలో నడుచుకొని వెళ్లాడు... ఆసరాతో ఎత్తులకు వెళ్లి పరిశీలించాడు...
అయినా ఏ పనిలో వున్నా మనసంతా అక్కడే వున్నప్పుడు, తను పనిచేసే చోటునుండే 50 సార్లకు పైగా వర్చువల్ ఇన్స్‌పెక్షన్ చేసాడు... ప్రత్యర్థులు యజమానులు గుండెను త్రవ్వుతున్నా, పని మీద మనసు పెట్టిన పోలవరం కూలీ, హెడ్‌వర్క్స్ 61% కుడి ప్రధాన కాలువ 99%, ఎడమ ప్రధాన కాలువ 88% మట్టిని ఎత్తి పోయించాడు... కాంక్రీట్ దిమ్మెతో కొడితే ఎంత నొప్పి వస్తుందో, అన్ని సూటి పోటి మాటలు భరిస్తూ, హెడ్‌వర్క్స్ 10% కుడి ప్రధాన కాలువ 83%, ఎడమ ప్రధాన కాలువ 47% కాంక్రీట్ పనులను, కాంక్రీట్ గుండెతో కూలీ పూర్తి చేసాడు... సిమెంటు నిర్మాణాలు 284 పూర్తి అయ్యి, 173 పురోగతిలో పెట్టి చేతిలో చేయాల్సింది, 270 పెట్టుకొని వున్నాడు కూలీ... మధ్యలో కాంట్రాక్టర్ ను మార్చం నుండి, చాలా కథలు వినిపిస్తున్నా, ఆత్మలు, ఊసరవల్లులు, మాటలతో ఎంత హింసిస్తున్నా సహనం కోల్పోక, ఓ కూలీగా సహిస్తోంది రాష్ట్ర బృహత్తర కార్యం కోసం... తనకన్నా చిన్న వాడు అయినా, మనసులో ఏ అంతరాయాలు పెట్టుకోకుండా, ఆయనింటికే వెళ్లి పోలవరం అవాంతరాలను, అంగాలార్చి వచ్చాడు తనకు తాను, కూలీగా అనుకోబట్టే... నాటకం లో కృష్ణ పాత్రధారులను మార్చినట్టు, పనులకు ఎన్నెన్నో కమిటీలు కమిట్మెంట్ కూలీ దిగుమతయ్యే ప్రతి కమిటీకీ, సమాధానాలు చెబుతూ, చేసుకొంటూ పోతున్నాడు శ్రద్దతో... చేతగాని ప్రత్యర్థుల తాటాకుల శబ్దాలకు, బెదిరే కూలీ కాదు... ఎందుకంటే ఆయన గుండెల్లో, రాష్ట్ర పచ్చదనం ఆశ శబ్దం చేస్తోంది... (చాకిరేవు బ్లాగ్ సౌజన్యంతో)
మెత్తగా ఉంటే మొత్త బుద్దేస్తుందంట! అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగాడు..! మోడీ గారు అత్యంత విశ్వసనీయ మైన ఎన్డీయే భాగస్వామిని ముప్పుతిప్పలు పెడుతున్నారు...ఆటంకాలు,,అడ్డంకులు,,లోకల్ లీడర్ల అర్దం లేని విమర్శలు... అన్నీ భరించి,,సహించి,,ఓర్పుగా,,నేర్పుగా నెట్టుకొచ్చారు...పోలవరం దగ్గర కొచ్చేసరికి ఆయన ఇంక సహనం కోల్పోతున్నారు... ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వకుండా..కెలికి..కెలికి..కెలికి..ఆయన్ని విసిగించారు...ఇబ్బంది పెట్టారు..రాజకీయంగా ఆయన మేరునగధీరుడు ...ఆయన మీకంటే ఉన్నత స్దాయి రాజకీయవేత్త..ఎంత ఉన్నతుడంటే ...తలెత్తి ఆయన వంక చూస్తే ..మెడలు నొప్పి పెడతాయి...మీకు భయం..అభద్రత..అనుమానం..ఈ అవలక్షణాలు తో తెగతెంపులవరకు తెచ్చేసుకుంటున్నారు.... మోదీ గారు చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు...అసలు మీకు ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే ఈయనే!చంద్రబాబు మీ పక్షాన ఉండగా గుండెలమీద చెయ్యేసుకుని అడిగినవి, అడగనివి ఇచ్చి రాష్ట్రానికి మేలు చేసి తద్వారా అయినా మీరు బలపడాల్సింది పోయి...సమాధి లోంచి కాంగ్రెస్ సైతాను ని నిద్రలేపుతున్నారు....పోలవరంలో సిగపట్లు వద్దు, బాబు భరిస్తారు మాకోసం... కానీ ఆయనను బాధపెట్టడానికి, రాష్ట్ర వినాశనానికి తెగబడితే, ఆయన బాధపడతారు... ఆయన బాధపడితే, రాష్ట్రం బాధపడుతుంది ఎన్నికల ఫలితాల వరకు ఎరుకవ్వదు... ఆంధ్రుడు ఆగ్రహిస్తే, ఎంతటి బోసడీకె ‘చెయ్యి’ని అయ్యినా, భస్మాసుర ‘హస్తం’గా మారుస్తారని... రాజకీయాలలో హత్యలుండవు...ఆత్మహత్యలే!