నవ్యాంధ్ర జీవనాడి పోలవరం పూర్తిచేయాలని ఎంతో, ఓర్పుతో బాధను దిగమింగి పోరాడుతున్నా... కొర్రీలుపెడుతూ సహకరించను అంటుంది కేంద్రం... మొన్న కాఫర్ డ్యాం ఆపెయ్యమంది... ఓ కమిటీ వేస్తామని చెప్పెంది... అప్పటి దాకా ఆగమంది.... కాని ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు... తాజాగా స్పిల్‌వే, స్పిల్ చానల్ టెండర్లు ఆపాలని హుకుం జారీ చేసింది... ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 27న లేఖ రాసింది... ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్ పనులపై కేంద్రం పెడుతున్న కొర్రీలకు ఇబ్బంది పడుతున్న రాష్ట్రం, ఇప్పుడు స్పిల్ వే, చానల్ టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు... పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్న కేంద్రం పదే పదే కొర్రీలేస్తూ పనులు ముందుకు సాగకుండా స్పీడ్ బ్రేకర్లు వేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ..
ఈ ఏడాది అక్టోబరు 13న నాగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి, పోలవరం కాంక్రీట్ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదని, 2018కి గ్రావిటీ ద్వారా 2019కి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో కొంత భాగానికి టెండర్లు పిలుస్తామని వివరించారు. కాంక్రీట్ పనుల కోసమే టెండర్లను పిలుస్తున్నందున, మైనస్ 14 శాతానికి మించి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం బృందం వివరించింది... కొత్త టెండర్లకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్లుగా పేర్కొనడంతో స్పిల్ వే, స్పిల్ చానల్‌కు సంబంధించి మిగిలిన రూ.1395.30 కోట్ల మేర పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. కానీ ఈ టెండర్లను నిలుపుదల చేయాలంటూ.. ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్ లేఖ రాశారు... టెండర్లుకు తక్కువ సమయం కేటాయించారనే కారణం చూపి, ఇవి ఆపేయాలి అని లెటర్ లో రాసారు...
ఒక్క రోజు లో రిటైర్ అవుతుండగా, కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్, పోలవరం పనులు నిలిపివేయాలి అంటూ, రాష్ట్రానికి ఉత్తరం రాశారు... చంద్రబాబు గారి ఓర్పుని, మంచితనంని చేతకాని తనంగా తీసుకొంటే బీజేపికి కూడా కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో. కేంద్రం అన్ని నిధులు ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది అని డబ్బాలు కొట్టుకునే బీజేపీ, పోలవరం గురించి ఎందుకు మీ అధిష్ఠానంని నిలదీయడం లేదు. బాబు గారు మా రాష్ట్ర భవిష్యత్ కోసం, మా ప్రజల కోసం అన్ని భరిస్తూనారు. ఇలాగే చేస్తే చంద్రబాబు తిరగబడటానికి ఆలోచిస్తారు ఏమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు... పోలవరం మన నినాదం... పోలవరం మన హక్కు... పోలవరం మన జీవ నాడీ... పోలవరం మన ఆత్మ... పోలవరం మన ఊపిరి... పోలవరం మన శ్వాస... పోలవరం మన సర్వం... కాదు కూడదు అని అడ్డుపడితే, చరిత్రని అడగండి, ఆంధ్రా వాడి దమ్ము ఏంటో... జై ఆంధ్రప్రదేశ్... జైజై అమరావతి... జైజైజై పోలవరం...