స్పిల్‌వే, స్పిల్ చానల్ కాఫర్ డ్యామ్ ఆపమని కేంద్రం చెప్పటంతో, రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి... పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్న కేంద్రం పదే పదే కొర్రీలేస్తూ పనులు ముందుకు సాగకుండా స్పీడ్ బ్రేకర్లు వేస్తోందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది... దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు... పోలవరం పనులు ఆపాలన్న కేంద్రం లేఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు... గడ్కరీతో మాట్లాడేందుకు ప్రయత్ని్ంచానని, ఆయన లండన్ లో ఉన్నారని, గడ్కరీ లండన్ నుంచి రాగానే మాట్లాడుతానని చెప్పారు... పోలవరం కోసం ఇంకా 60 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, 98 వేల గిరిజన కుటుంబాలు ఉన్నాయని అన్నారు...
కేంద్రం ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, పోలవరం టెండర్ల పై ముందుకు వెళ్ళాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు... ముఖ్యమంత్రి సూచన ప్రకారం, టెండర్లను ఆన్లైన్ లో ప్రభుత్వం అప్లోడ్ చేసింది... కేంద్రం ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, పనుల్లో మాత్రం జాప్యం జరగకూడదు అని, అనుకున్న ప్రకారం ముందుకు వెళ్ళమని చంద్రబాబు ఆదేశించారు... ప్రాజెక్ట్ పనులకు 1483 కోట్లతో టెండర్లు పిలిచారు... స్పిల్ వేకు రూ.683 కోట్లు, స్పిల్ చానెల్ కు 850 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలకు డిసెంబర్ 20 వరకు గడువు...21న టెక్నికల్ బిడ్, 23న ఫైనాన్షియల్ బిడ్ తెరవాలని నిర్ణయించారు...
అంతే కాకుండా, బీజేపీ ప్రజాప్రతినిధులలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు... ఈ భేటీలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గున్నారు... పోలవరం టెండర్ల నిలిపివేత, పునర్విభజన చట్టం ప్రత్యేక ప్యాకేజీ ఆర్ధికసాయంపై చర్చించారు... కేంద్రం మీద మీరు కూడా ఒత్తిడి తేవాలని బీజేపీ ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.. మరో వైపు కేంద్రం నిర్ణయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కేంద్రం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు... రాజకీయలు ఎలా ఉన్నా, పోలవరం ఆపాలి అనుకోవటం దారుణం అని, కేంద్రం వెంటనే తన వైఖరి మార్చుకోవాలని, పోలవరం పూర్తి చెయ్యటానికి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలి అని అంటున్నారు...