"సొంతింట్లో ఉండాలన్నది ప్రతి ఒక్క రి కల.. అందులో ఉండే ఆనందమే వేరు. ఇక్కడ బాడుగ పెంచరు. ఖాళీ చేయమని ఎవరూ బలవంత పెట్టరు. సమాజంలో సొంతిల్లు ఉంటే హోదా ఇస్తుంది, భరోసా ఇస్తుంది. ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా పేదల కల నెరవేరుస్తాం. సంక్రాంతికి తిరుపతిలో 4600 ఇళ్లను కానుకగా ఇస్తాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి రూరల్ వేదాంతపురం వద్ద ఐహెచ్ఎస్డీపీ కింద నిర్మించిన 1704 ప్రభుత్వ గృహాలకు సంబంధించి తాళాలను శనివారం సాయంత్రం లబ్దిదారులకు ఇచ్చి, వారితో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రూ.297 కోట్లతో 7416 ఇళ్లను పూర్తి చేసి ఏడు కొండల పేర్లను పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. తాజాగా పూర్తి చేసిన రెండు బ్లాక్లకు వెంకటాద్రి, గరుడాద్రిలుగా పేరు పెట్టామన్నారు. గతంలో 524 ఇళ్లను కేటాయించగా, డిసెంబరులో 3200 ఇళ్లను, జనవరిలో 1400 ఇళ్లను పూర్తి చేసి సంక్రాంతికి ఇస్తామన్నారు.
కాగా, ఇళ్లకోసం పేదలు 2007లో దరఖాస్తు చేసుకుంటే నివాస యోగ్యత లేని విధంగా ఈ గృహ సముదాయాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి, మధ్యలోనే వదిలేసిందని ఆరోపించారు. ఏడు వేల ఇళ్లను ప్రారంభించినా అందులో 528 గృహాలను పనులు పూర్తి చేయకుండానే పేదలకు కేటాయించిందన్నారు. రూ.176 కోట్ల ఖర్చుచేసి చేతులెత్తేయడంతో తాము మరో రూ.120 కోట్లు వెచ్చించి మొత్తం రూ.296 కోట్లతో ఏడాదిన్నర కాలంలోనే వీటి నిర్మాణం పూర్తి చేస్తున్నటు చంద్రబాబు తెలిపారు. తిరుపతిని అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. తెలుగుగంగ ప్రాజెక్కతో దాహార్తి తీర్చామన్నారు. ఇస్కా సమావేశాలను నిర్వహించి రోడు, డ్రైన్లను బాగు చేశామని తెలిపారు. స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేప టామన్నారు. తిరుపతిలో వంద చెరువులను అభివృద్ధి చేసి, లేక్స్ ఆఫ్ సిటీగా చేస్తామని ప్రకటించారు.
ఐహెచ్ఎన్డీపీ లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. పదేళ్ల కిందట దరఖాస్తు చేసుకుంటే, ఇప్పుడు సొంతింటి కల సాకారమైందని వనజ అన్నారు. ఇప్పటిదాకా అద్దె ఇంట్లో పడిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇన్నాళ్లు రూ.2500 అద్దె ఇంట్లో ఉన్న తమకు. ఇకపై సొంతింట్లో ఉండబోతున్నందుకు సంతోషంగా ఉందని శోభ తెలిపారు. సొంతింటి కల ఫలించినందుకు ఆనందంగా ఉందని శ్యామల చెప్పారు. "ఈ ప్రభుత్వం మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి అన్ని విధాలా పని చేస్తోంది మరి మీరేంచేస్తారు' అంటూ సీఎం చంద్రబాబు లబ్దిదారులను సరదాగా ప్రశ్నించారు. మీకే ఓట్లేస్తాం సార్ అంటూ అంతే వేగంగా లబ్దిదారులు స్పందించడంతో నవ్వులు పూశాయి. చంద్రబాబు కూడా నవ్వతూ. అవును కష్టపడే నాయకులకు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చాక మరింత కష్టపడతారు. మనకోసం కష్టపడేవారినే మనం ఎన్నుకోవాలి' అంటూ ముక్తాయింపు ఇచ్చారు. వేదాంతపురం వద్ద జరిగిన కార్యక్రమంలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు ఆస్తులను పంపిణీ చేశారు. 12 ఇన్నోవా కార్లు, 4 ట్రాక్టరు, 10 ఆటోలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ88.38 కోట్ల రాయితీ రుణాలు అందజేశారు.