ఇది జగన్ కు శ్రీవారి పట్ల ఉన్న విశ్వాసం... శ్రీవారి పై ఉన్న గౌరవం... శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే అన్యమతస్తులు స్వామి వారి పై తమకు నమ్మకం ఉందంటూ ఇవ్వాల్సిన హామీ పత్రం పై సంతకం పెట్టడానికి వైకాపా అధినేత జగన్ తిరస్క రించారు. టిటిడి అధికారులు సంతకం పెట్టమని వెంటపడినా, వారి మీద సీరియస్ అవ్వటంతో, పక్కనే ఉన్న చెవిరెడ్డి, వాళ్ళని పక్కకి తోసేసారు... శనివారం ఉదయం స్వామి వారి దర్శనం కోసం వైకుంఠం కాంప్లెక్స్లో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలని విధుల్లో ఉన్న టిటిడి అధికారులు కోరారు....
ఈ సందర్భంగా జగన్ అక్కడున్న సిబ్బంది వైపు ఆశ్చర్యంగా చూశారు. నన్నే అడుగుతారా అన్నట్టు మొఖం పెట్టారు... దీంతో విషయం అర్ధం చేసుకున్న చెవిరెడ్డి, వాళ్ళని పక్కకి తోసేసారు...దీంతో జగన్ లోపలకి దర్శనానికి వెళ్ళిపోయారు. డిక్లరేషన్ పై సంతకాన్ని జగన్ సున్నితంగా తిరస్కరించటం పై ఎలక్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో, ప్రజలు కూడా జగన్ చర్యను అసహ్యించుకున్నారు... వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్ళి భూమన కరుణాకర్ రెడ్డి ఈ పరిణామంతో తీవ్రంగా మండిపడ్డారు. అసలు జగన్ ను ఎవరూ డిక్లరేషన్ అడగలేదు అని, ఇలాంటివి అవసరం లేదు అన్నారు... కాని, వీడియోలో స్పష్టంగా,సంతకం పెట్టండి అని టిటిడి అధికారులు వెంటపడితే, చెవిరెడ్డి తోసేసింది కనిపిస్తుంది.... అయినా నాస్తికుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డికి, శ్రీవారి గురించి ఏమి తెలుసులే...
అంతే కాదు, జగన్ చివరకి శ్రీవారి ప్రసాదం కూడా తీసుకోలేదు... ఇది ఇంకో పెద్ద అపచారం అని పండితులు అంటున్నారు... శ్రీవారి ప్రసాదం ఇవ్వబోయిన పండితులకు ఒక నమస్కారం పెట్టి, జగన్ వెళ్ళిపోయారు... జగన్ చేసిన ఇంకో అపచారం, కొండ పైకి నడుచుకుంటూ వస్తాను అని చెప్పటం... కాని, అలా చెయ్యలేదు... శ్రీవారికి మొక్కు మొక్కుకుని, అలా చెయ్యకుండా వెళ్ళటం, తీవ్ర అపచారం అంటున్నారు... అయినా, ఒక సంతకం, నాకు శ్రీవారి పై నమ్మకం ఉంది అని పెడితే, ఏమైపోతుంది ? అసలు ఈ వివాదమే వచ్చేది కాదు కదా ? పోయిన సారి కూడా ఈ వివాదమే అయ్యింది కదా ? మళ్ళీ అదే తప్పు చేసారు అంటే, ఇది కావాలని చేసేందే కదా ? స్వామి వారి పట్ల భక్తి లేనప్పుడు రావటం ఎందుకు ?