నిన్న మన ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల గురించి, మన రాష్ట్రంలో వివిధ ప్రముఖ సంస్థలు చేసుకుంటున్న ఏంఓయు ల గురించి, వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... రోడ్డు మీద పోయేవాడికి, సూటు, బూటు వేయించి, వారితో ఫోటోలు దిగి, వీరే మనకి పెట్టుబడులు పెడుతున్నారు అని చంద్రబాబు రాష్ట్ర ప్రజలని మభ్యపెడుతున్నారు అని, జగన్ గారు అన్నారు... అయ్యా జగన్ గారు, ఈయన ఎవరో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అంట, చంద్రబాబుకి ఏ రోడ్డు మీద దొరికాడో, తీసుకోవచ్చి రెండు ఫోటోలు దిగి, ఈయన మన రాష్ట్రంలో ఉన్న 15 వేల మంది యువతకి సాంకేతిక శిక్షణ ఇస్తాడు అని, చంద్రబాబు చెప్తున్నాడు... ఎంత అన్యాయస్తుడు జగన్ గారూ, ఈ చంద్రబాబు....

mcrosfot 07112017 2

ఇంత సీరియస్ సబ్జెక్టు లో, ఇలా రాసినందుకు క్షమించండి... కాని మన పెట్టుబడి దారులని అవహేళన చేస్తున్న వారికి బుద్ధి రావటం కోసం తప్పదు... విషయానికి వస్తే, రాష్ట్రంలో నిరుద్యోగులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఆ సంస్థ టెక్నాలజీ/ టూల్స్‌లో ప్రధానమైన కైజాలా, అజ్యూర్‌ క్లౌడ్‌ స్టాక్‌, సంగం, లింక్‌డిన్‌, మైక్రోసాఫ్ట్‌ వర్చ్యువల్‌ అకాడమీ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి సహకారమందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై సంస్థ సీఈవో సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన సత్య నాదెళ్లతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోగంటి సాంబశివరావు భేటీ అయ్యారు.

mcrosfot 07112017 3

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తొలిదశలో 5వేల మందికి, రెండో దశలో 15వేల మందికి మైక్రోసాఫ్ట్‌ సంగం వేదికగా సోమవారం నుంచే శిక్షణను అందిస్తున్నామని సత్య నాదెళ్లకు సాంబశివరావు వివరించారు. మొబైల్‌ ఆధారిత వృత్తి విద్యతో కూడిన సమగ్ర శిక్షణ ఇస్తామన్నారు. అధిక ఉద్యోగావకాశాలు ఉన్న కంప్యూటర్‌ అసిస్టెంట్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఎలక్ట్రికల్‌ అండ్‌ హౌస్‌ వైరింగ్‌ టెక్నాలజీస్‌, నర్సింగ్‌, జనరల్‌ పేషెంట్‌ అసిస్టెంట్స్‌, మొబైల్‌ అసెంబ్లింగ్‌, హాస్పిటాలిటీ స్వీవర్డ్స్‌, వెయిటర్స్‌, కస్టమర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కుట్టుమిషన్లు వంటి రంగాల్లో శిక్షణను ఇస్తున్నామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read