ముఖ్యమంత్రి కుర్చీ కోసం, ఒక పక్క పాదయాత్ర చేస్తున్న ఉత్సాహం ఉన్నా, లోపల మాత్రం జగన్ టెన్షన్ తో ఉన్నారు... దీని అంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్... జగన్ తన సొంత మీడియా, పేపర్ తో పాటు, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి, ఎంత విష ప్రచారం చేస్తున్నారో తెలిసిందే... అలాగే ఏనాడు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోక, నిర్మాత్మకమైన సలహాలు ఇవ్వకుండా, రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్ర పరువు తియ్యటానికి కూడా జగన్ వేనుకాడుటలేదు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి విరుగుడుగా, జగన్ ని టార్చర్ పెట్టే గేమ్ ప్లాన్ ప్రారంభించింది. జగన్ వైఖరి పట్ల చాలా మంది నాయకులు, ఎమ్మల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే... ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి ఆయుధం అయ్యింది... తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంతో పాదయాత్రలో తొలి అడుగువేసిన జగన్ కు ఆరంభంలోనే షాకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరిని తెలుగుదేశం పార్టీ చెంతకు చేర్చుకుని తమ ఉద్దేశ్యాన్ని మరోసారి స్పష్టం చేసింది.

jagan 051120d17 2

నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లోనూ, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్స్ ని రాజకీయంగా దారుణంగా దెబ్బతీసే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతుంది. వైఎస్సార్స్ ఎమ్మెల్యేలు పలువురు తమతో టచ్లో ఉన్నారని, వారంతా తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటనలు గుప్పించిన టిడిపి సీనియర్ నాయకులు జరగబోయే పరిణామాలను వెల్లడించారు. ఇదే అంశం జగన్‌ను కలవరపెడుతోందని వైసీపీలో చర్చ జరుగుతోంది. సుమారు 15 మంది టీడీపీ గూటికి చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వారెవరో తెలుసుకోవాలని జగన్ ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. వాళ్ళని ఈ పాదయాత్ర అయ్యే వరకు ఎలా అయినా ఆపాలని బొత్సా, అంబటికి బాధ్యతలు అప్పగించారు... తరువాత వెళ్ళినా ఇబ్బంది లేదని, ఇప్పుడు వెళ్తే నా పరువు అంతా పోతుంది అని జగన్ టెన్షన్ లో ఉన్నారు...

jagan 051120d17 3

జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించిన వెంటనే కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను పార్టీలో చేర్చుకుని తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసిన టిడిపి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా దెబ్బతీస్తామని హెచ్చరికలు పంపింది. ఈనెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించనుండగా, అదే రోజు మరో ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రానున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే జగన్ మీద చాలా మంది ఎమ్మల్యేలు అసంతృప్తితో ఉన్నా, ఎలాగొలా నేట్టుకుస్తున్నారు.. కాని, జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో, కొంత మంది ఎమ్మల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు... శాసనసభ సమావేశాల బహిష్కరించిన వైసీపీ ఆధినేత తీరు సరైందికాదు, ప్రజాస్వామ్య విధనాలకు ఆయన తిలోదకాలు ఇచ్చారనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళకుండా, ఈ పదవులు ఎందుకు, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా, ఈయన వెనుక తిరిగితే, మాకు రేపు ఓట్లు వెయ్యమంటే ఎవరు వేస్తారు... మేము అవసరమైతే ప్రజా తీర్పుకు తలొగ్గి అసెంబ్లీకి వెళ్తాం... జగన్ ఏమి చేస్తాడో చూస్తాం అంటూ ధిక్కార స్వరంలో ఉన్నారు... ఇలాంటి వాళ్ళని కూడా తెలుగుదేశం ట్రాప్ చేసి, జగన్ కు టార్చర్ అంటే ఏంటో చూపించాలి అనే ఉద్దేశంలో ఉంది... ఇప్పుడు మాకు టైం వచ్చింది... ఇన్నాళ్ళు జగన్ అసత్య ప్రచారాలతో మమ్మల్ని ఎలా వేధించాడో, మేము దానికి రెండింతలు జగన్ ని ఎండగాడతాం అంటుంది అధికార పక్షం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read