స్వచ్చమైన గోదావరి యాసలో, ప్రత్యర్దులకి కౌంటర్ లు వేసే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారు మానవత్వాన్ని చాటుకున్నారు... తన పర్యటనలో భాగంగా, రొజూలాగే బయలేదేరిన హోం మంత్రికి, యువకుడు ఆక్సిడెంట్ అయ్యి ఉండటం చూసి, యువకుడిని తన కాన్వాయ్ లోనే హాస్పిటల్ లో జాయిన్ చేసి, ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు... పోలీస్లు అందరికీ బాస్ అయినా, తనకూ హృదయం ఉంది అని, మానవత్వం చాటుకుని, నలుగురికి ఆదర్శంగా నిలిచారు...
వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోని కెనాల్ రోడ్డులో ఓ యువకుడు బైకు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డు ప్రక్కన పడివున్న ఆ యువకుడి వద్ద జనం గుమిగూడి వుండటంతో అటుగా తన నివాసానికి కాన్వాయ్ లో వెళుతున్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగి ఏం జరిగిందని ఆరా తీశారు. కారు దిగి ఆ యువకుడు దగ్గరకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ..
మాగాం గ్రామానికి చెందిన పేరిచర్ల సుధీర్ వర్మ గా గుర్తించారు. మోకాలు,చేతులు ,నడుమ భాగం పై గాయాలతో బాధపడుతున్న సుధీర్ వర్మ ను తన కాన్వాయ్ పోలీసు వాహనంలో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సుధీర్ వర్మ బైకు ను అక్కడ పాకలో పెట్టి తాళం వేయించి అతనికి అందించారు. బంధువులకు సమాచారం అందించమని, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని అమలాపురం డిఎస్పీ ప్రసన్నకుమార్ ను హోంమంత్రి చినరాజప్ప ఆదేశించారు....