నేను ముఖ్యమంత్రి అవ్వటం కోసం పాదయాత్ర చేస్తున్నాను... పాదయత్ర ముందు తిరుమల వెంకన్నను దర్శించుకుంటాను అంటూ, హడావిడి చేసిన జగన్ కు ఆది లోనే హంస పాద ఎదురైంది... జగన్, తిరుమల కొండ పైకి నడుచుకుంటూ వస్తారు అనే ప్రోగ్రాం ఉంది. అయితే, ఆ ప్రోగ్రాం అర్ధంతరంగా కాన్సిల్ అయినట్టు, తిరుపతి నాయకులకి సమాచారం అందింది... విషయం ఏంటి అని ఆరా తియ్యగా, ఇవాళ శుక్రవారం కావటంతో, జగన్ అక్రమాస్థుల కేసులో కోర్ట్ కి హాజరు అయ్యారు....
అయితే, అనుకున్న సమయానికి అంటే ఎక్కువగా కోర్ట్ లో టైం తీసుకుంది... దీంతో జగన్ షడ్యుల్ మొత్తం మారిపోయింది... ఫ్లైట్ మిస్ అయ్యింది... తరువాత ఫ్లైట్ కి తిరుపతి వెళ్ళాల్సిన పరిస్థితి... దీంతో, కొండ పైకి నడుచుకుంటూ వచ్చే ప్రోగ్రాం రద్దు అయింది... జగన్, నేరుగా తిరుమల కొండ పైకి వాహనంలో వెళ్ళిపోతారు... రేపు పొద్దున, శ్రీవారి దర్శనం చేసుకుంటారని, పార్టీ వర్గాలు అంటున్నాయి... శ్రీవారి దర్శనం అవ్వగానే, కడప దర్గా, ఇదుపులుపాయ చర్చలో కూడా జగన్ ప్రార్ధనలు చేసి, పాదయాత్ర మొదలు పెడతారు...
అయితే, శుభమాను శ్రీవారి దర్శనానికి, కొండ పై నుంచి నడుచుకుంటూ ప్లాన్ చేస్తే, ఇలా అయ్యింది ఏంటి అంటూ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి... ఇది అపసకునంగా అభివర్ణిస్తున్నాయి... జగన్ పాదాలు తమను తాకకూడదని ఆ సప్త గిరులు భావించాయేమో అని అనుకుంటున్నారు.... ఏది ఏమైనా, స్వామి వారి అనుగ్రహం లేనిదే, ఎవరూ ఏమి చెయ్యలేము, అంతా చేసేది, ఆ స్వామీ వారే, మనం నిమిత్తమాత్రులం అంటూ, మారిన షడ్యుల్ ప్రకారం తదుపరి జగన్ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటున్నారు...