అప్పుడే నాంపల్లి కోర్ట్ నుంచి బయటకు వస్తున్న జగన్ కు, అంబటి రాంబాబు చెప్పిన బ్రేకింగ్ న్యూస్ విని, దడ మొదలైంది.... పాదయత్ర జోష్ లో ఉన్న జగన్ కు ఇది నిజంగా చెదు వార్తే... మొన్న కెసిఆర్ కూడా ఇదే చెప్పాడు, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు ఇదే చెప్పాడు, ఢిల్లీ వర్గాలు కూడా ఇదే కన్ఫర్మ్ చెయ్యటంతో, జగన్ మరింత ఆందోళనలో ఉన్నారు... విషయం ఏమిటి అంటే, నియోజకవర్గాల సంఖ్య పెంపు కచ్చితంగా జరగబోతోందని, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ లో చెప్పారు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజ్‌నాథ్‌తో చర్చించామన్నారు. అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సీట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని అమిత్ షా బదులిచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. మొత్తానికి ఈ సీట్లపెంపుపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ..
ఇప్పుడు ఇదే న్యూస్, జగన్ క్యాంప్ ను భయపెడుతుంది... తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా, వలసలను ప్రోత్సహించటం ఆపింది... పాదయాత్ర మొదలు పెట్టగానే, వలసలు ఉంటాయి అని అటు జగన్ కి కూడా తెలుసు... అయితే, కొంత మంది నాయకులు మాత్రం, తెలుగుదేశంలోకి వెళ్తే సీట్ రాదేమో అని ఉద్దేశంతో, ఉండిపోతున్నారు... ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంపు ఉంది అని తెలిస్తే, ఈ వలసలు ఊపందుకుంటాయి.... ఇది ఇలా ఉండగానే, జగన్ కు ఇంకో సమస్య... ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో కాండిడేట్ లేక ఇబ్బంది పడుతున్న జగన్ కు, ఇది ఇంకో సమస్యగా మారుతుంది... అందులోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఆ డ్యామేజ్ ఏంటో జగన్ కు తెలుసు... వీటన్నిటిని అలోచించి జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు...