భన్వర్‌లాల్‌... 2014 ఎలక్షన్స్ దగ్గర నుంచి, మొన్నటి నంద్యాల ఎన్నికల వరకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన పేరు... భన్వర్‌లాల్‌, తన సర్వీస్ పూర్తి అవ్వటంతో, రిటైర్డ్ అయ్యారు... అయితే, ఆయన మీద ఆరోపణలు, జరిమానా కట్టకపోవటం లాంటి ఆరోపణలు ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసు జరీ చేసేంది... ఇలాంటి నోటీసులు ఎంతో మందికి వస్తూ ఉంటాయి... కాని, వైసీపీ బ్యాచ్ తో పాటు, ఇంటి దొంగ అయిన ఐవైఆర్ కృష్ణా రావు మాత్రం, భన్వర్‌లాల్‌ విషయంలో మాత్రమే హడావిడి చేస్తూ స్పందిస్తున్నారు... ఆ నోటీసు ఎదో, వీళ్ళకి వచ్చినంత బాధగా ఫీల్ అయిపోతున్నారు... ప్రభుత్వం నోటీసులు తప్పు ఉంటే భన్వర్‌లాల్‌ ఈ పాటికి కోర్ట్ కి వెళ్ళటమో, లేక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు విన్నవించుకోవటమో చేసే వారు... అసలు ఇలాంటి విషయాలు ఐవైఆర్ కృష్ణా రావుకు ఎందుకు ? ఆయన వైసీపీ ఏజెంట్ గా ఎందుకు పని చేస్తున్నారు ? సాక్షి మాత్రమే, ఐవైఆర్ కృష్ణా రావు వార్తలకు అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తుంది ? మరి వీరికి భన్వర్‌లాల్‌ మీద అంత ప్రేమ ఎందుకు ? తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు, భన్వర్‌లాల్‌ నిజంగానే వైసీపీకి అనుకూలంగా పని చేసే వారా ?

jagan bhanwar 03112017 2

ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది... మొన్న నంద్యాల ఎన్నికల ప్రచారంలో, భన్వర్‌లాల్‌ తీరును సామన్య ప్రజలు కూడా తప్పు బట్టారు... సాక్షి ఛానల్ చెప్పింది అని, సాక్షాత్తు, ముఖ్యమంత్రికి ఆహరం తీసుకువెళ్ళే వాహనం బద్దలు కొట్టి హడావిడి చేశారు... ముఖ్యమంత్రిని కాల్చేస్తా, ఉరితీస్తా అని జగన్ అంటే, ఆ మాటలకు తెలుగుదేశం ఫిర్యాదు చేస్తే, అసలు దాని గురించి పట్టించుకోలేదు... వైసీపీ నేతలు ఏ ఫిర్యాదు చేసినా వెంటనే రియాక్ట్ అయ్యేవారు..

jagan bhanwar 03112017 2

ఇప్పుడే కాదు భన్వర్‌లాల్‌... 2014 ఎలక్షన్స్ టైంలో కూడా, ఇలాగే పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.. 2014 ఎన్నికల్లో, నెల్లూరు ప్రకాశం జిల్లాలో, వైకాపా నాయకులు పంచిన, ల్తీ మద్యం తాగి, 8 మంది చనిపోయారు... దానికి కారణం అయిన వారి అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏ చర్యలు తీసుకోలేదు.... ఇప్పుడు ప్రభుత్వానికి అద్దె కట్టకుండా ఎగ్గోట్టారని, ఆ డబ్బులు ఇవ్వండి అని నోటీసు ఇస్తే, సాక్షి వైకాపా ఐవైఆర్ కృష్ణా రావులు భుజాల మీద మొయ్యడం కృతజ్ఞతతోనే చేస్తున్నారా అనే అనుమానులు వస్తున్నాయి... నిజానికి భన్వర్‌లాల్‌ ఆ ఆద్దె డబ్బులు ఇస్తే, అవి చంద్రబాబు జేబులుకి వెళ్ళవు, అవి రాష్ట్ర ఖజానాకు వస్తాయి.. మరి, ఇలాంటి వాటి కోసం పోరాడకుండా, భన్వర్‌లాల్‌ ఆద్దె డబ్బులు ఇవ్వరు అని వీళ్ళు ఎందుకు మోస్తన్నారో, ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read