ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం, నిరంతరం పడుతున్న శ్రమకు ఫలితాలు వస్తున్నాయి... అనంతపురం జిల్లాలో అతి పెద్ద కియా కార్ల కంపెనీ వచ్చిన సంగతి తెలిసిందే... ఇప్పుడు, అదే అనంతపురం జిల్లాకి, ప్రముఖ కంపెనీ జాకీ ఇన్నెర్స్ వస్తుంది... ఇప్పటి వరకు కర్ణాటకలోని బెంగుళూరులో ఉన్న కంపెనీ, తన బేస్ మొత్తం షిఫ్ట్ చేసుకుని, మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడుకు షిఫ్ట్ అవ్వనుంది... 2018 అక్టోబర్ లో ఈ యూనిట్ తన ఆపరేషన్స్ ను మొదలు పెడుతుంది.
మూడు దశల్లో ఈ కంపెనీ నిర్మాణం జరగనుంది. మొత్తంగా 6420 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తోలి దశలో 3000 మందికి ఉపాధి రానుండగా, మరో 3420 మందికి దశల వారీగా ఉపాధి కలగనుంది. ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అండ్ అప్పారెల్ పాలసీ 2015-2020 కింద ఈ కంపెనీకి మెగా ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తూ, ప్రభుత్వం జిఓ కూడా రిలీజ్ చేసింది... ఏడాదికి 32. మిల్లియన్ ఇన్నెర్స్ రాప్తాడు కొత్త పరిశ్రమలో తయారు కానున్నాయి. రాప్తాడులో 30 ఎకరాల స్థలం ఎకరాకు 10 లక్షలకే ఇవ్వడానికి సిద్ధం అయ్యింది చంద్రబాబు ప్రభుత్వం... అలాగే 5 సంవత్సరాలకు గాను, యూనిట్ కరెంట్ కు , 1.50 పైసలు రీఇమ్బర్స్మెంట్ కూడా ఇవ్వనుంది..
వెనుకబడిన జిల్లాగా పేరు గాంచిన, అనంతపురం జిల్లాలో ఇప్పటికే కియా మోటార్స్ వచ్చింది. మొదటి కార్ ప్రొడక్షన్, 2019లో మొదలవ్వుంది... కియాతో పాటు, దాదాపు 40 వరకు అనుబంధ పరిశ్రమలు కూడా రానున్నాయి... ఇప్పుడు జాకీ లాంటి అతి పెద్ద కంపెనీ రాకతో, కరువు జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. త్వరలోనే, జాకీ కంపనీతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MoU కుదుర్చుకోనుంది... ఒప్పందం అవ్వగానే, ప్లాంట్ నిర్మాణం మొదలు పెట్టి, అక్టోబర్ 2018 నాటికి రెడీ చెయ్యాలని జాకీ కంపెనీ భావిస్తుంది...