ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఇవాళ పొద్దున్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే... జగన్ ప్రతి తిరుమల పర్యటన లాగే, ఈ పర్యటన కూడా వివాదాల మధ్యే నడించింది... అన్యమతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అంటే, ముందుగా శ్రీ వారి పట్ల మాకు నమ్మకం ఉంది అని, డిక్లరేషన్ ఇవ్వాలి... ఎంత పెద్ద వారు వచ్చినా అది ఆనవాయతీ... పోయిన సారి, జగన్ తిరుమల వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు.. ఈ సారైనా జగన్, డిక్లరేషన్ ఇస్తారు అని అందరూ ఆశించారు... జగన్ శ్రీ వారి పట్ల, నమ్మకం ఉంది అని చెప్తారు అనుకున్నారు... కాని అలాంటిది జరగలేదు...

jagan tirupati 04112017 2

పైగా, పక్కనే ఉన్న చెవిరెడ్డి, వివాదాలకు తావు ఇవ్వకుండా, డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టమని, జగన్ దగ్గరకే బుక్ తీసుకువచ్చి చెప్పారు... దీంతో జగన్, ఇంతెత్తున లెగిసి, నీ హద్దులు నువ్వు తెలుసుకో, నాకు ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలుసు... చెయ్యాలో వద్దో, నీ చేత నేను చెప్పించుకునే స్థితిలో లేను... మా నాన్న ఏ రోజైన బుక్ లో సంతకం పెట్టారా ? మరి నేను ఆయన్ను ఫాలో అవ్వలా లేదా ? మా నాన్న ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తా అని చెవిరెడ్డి మీద అరవటంతో, అందరూ షాక్ అయ్యారు... ఇక చేసేది ఏమి లేక, చెవిరెడ్డి మిన్నకుండిపోయారట. జగన్ చేసిన పని కరెక్ట్ అని, అక్కడ జగన్ తో పాటు వచ్చిన మిగతా అన్యమతస్థులు కూడా అనటంతో, చెవిరెడ్డి నాకెందుకులే గోల అని, ఆ విషయాన్ని వదిలేసి, దర్శనానికి వెళ్ళిపోయారు.. అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత కొందరు టీటీడీ అధికారులు ఆయనకు ఎదురెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో వారివైపు ఆగ్రహంగా చూసిన జగన్, ఆపై తమాయించుకుని సున్నితంగా తిరస్కరించి దర్శనానికి వెళ్లిపోయారు.

jagan tirupati 04112017 3

ఈ వివాదం ఉండగానే, జగన్ చివరకి శ్రీవారి ప్రసాదం కూడా తీసుకోలేదు అనే విషయం కూడా బయటకు రావటంతో, అందరూ ఆశ్చర్యపోతున్నారు... అసలు జగన్ కు శ్రీవారి మీద నమ్మకం లేకపోతే, ఈ షో అంతా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.... కొండ పైకి నడుచుకుంటూ వాస్తాను అని ప్లీనరీలో అందరి ముందూ చెప్పారు... కోర్ట్ లో లేట్ అయ్యింది అని, అది వదిలేసి డైరెక్ట్ గా కార్ లో కొండ పైకి వెళ్లారు... అక్కడ డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టలేదు... శ్రీ వారి ప్రసాదం ముట్టలేదు... కాని, ఆ స్వరూపానంద, చిన్నజీయర్ సేవలో మాత్రం, ఎక్కడ లేని వినయం చూపిస్తున్నాడు... శ్రీ వారితో ఆటలు వద్దు అంటూ, వెంకన్న భక్తులు జగన కు సలహా ఇస్తున్నారు... అయినా, ఆయన మారడు... అతనికి ఉన్న చరిత్ర అలాంటింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read