కాంగ్రెస్ మాజీ నాయకుడు, విజయవాడ నుంచి గతంలో రెండు సార్లు ఎంపిగా గెలిచిన లగడపాటి రాజగోపాల్, సడన్ గా లోటస్ పాండ్ లో ప్రత్యక్షమవటం సంచలనం సృష్టించింది... లగడపాటి, జగన్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది... ఏమన్నా రాజకీయ కోణం ఉందా అని అందరూ ఆరాలు తీస్తూ, ఎవరికీ తోచిన ఈక్వేషణ్ వాళ్ళు చెప్తున్నారు...
గురువారం మధ్యహ్నం జగన్ సీనియర్ నాయకులతో, పాదయాత్ర గురించి చర్చిస్తూ ఉండగా, లగడపాటి రాజగోపాల్ వచ్చారు అనే మసేజ్ జగన్ కు చెప్పారు.. అక్కడ ఉన్న నాయకులు ఒక్కసారి అవాక్కయ్యారు... ఒక పక్క పాదయాత్ర గురించి మాట్లాడుతుంటే, ఈయన ఎందుకు వచ్చాడు అంటూ షాక్ అయ్యారు... జగన్, బయటకు వెళ్లి లగడపాటి రాజగోపాల్ని కలిసారు... తీరా చుస్తే, లగడపాటి రాజగోపాల్ కుమారడు వివాహం త్వరలో జరగనుంది, ఆ వివాహానికి జగన్ ను ఆహ్వానించటానికి లగడపాటి రాజగోపాల్, లోటస్ పాండ్ వచ్చారు... దీనికి ఏ విధమైన రాజకీయ కోణం లేదు అని చెప్పారు...
నిజానికి లగడపాటి రాజగోపాల్, జగన్ కు వోట్ వెయ్యద్దు అంటూ, 2014 ఎలక్షన్స్ ముందు చెప్పారు.. ఇప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా, వ్యవహరిస్తున్నారు అని వార్తలు వస్తూ ఉంటాయి... నంద్యాల, కాకినాడ ఎలక్షన్స్ కి, లగడపాటి, తెలుగుదేశంకు అనుకూలంగా రిపోర్ట్ లు కూడా ఇచ్చారు... ఇప్పటికీ జగన్ మీద రాజాకీయంగా, లగడపాటి రాజగోపాల్ కి వ్యతిరేక అభిప్రాయం ఉంది కాని చెప్తారు... అలాంటి లగడపాటి, జగన ను కలిసే సరికి, రాజకీయంగా ఊహాగానాలు వచ్చినా, అది పెళ్లి పిలుపు కోసం అని తెలిసే సరికి, అందరు లైట్ తీసుకున్నారు...