నవంబర్ 10 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే... అయితే అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు... తను పాదయాత్రలో ఉండగా, వేరే వారికి అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వటం ఇష్టంలేక, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అని ఆదేశాలు జారి చేశారు... దానికి సాకుగా, ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభకు మేము వెళ్ళము అని చెప్పారు... నిజానికి, ప్రతిపక్షంలో ఒక్కరూ లేకుండా, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోను సభ జరగలేదు... ప్రజల్లో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పై వ్యతిరేకత వచ్చింది...
అయితే, వైసీపీ సభ్యుల నిర్ణయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడారు... శాసనసభకు రావాలని, వారిని రిక్వెస్ట్ చేశారు... అయితే, ఆ ఎమ్మెల్యేలు అందరూ, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము రాలేము అని చెప్పారు... దీంతో స్పీకర్, వారికి బాధ్యతలతో పటు, నిబంధనలు గుర్తు చేశారు... మనం అసెంబ్లీలో ప్రజా సమస్యల పై చర్చించాలి, ప్రతిపక్షంగా మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది...వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు హాజరుకాకపోతే.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం చట్టంలో ఉందని చెప్పారు... మేము ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నామని వారు స్పీకర్ కి చెప్పారు...
స్పీకర్ కోడెల, ఈ విషయాన్ని మీడియాతో కూడా చెప్పారు...వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకామనడం ఆశ్చర్యానికి గురిచేసిందని, మాజీ సీఎంలు ఎన్టీఆర్, జయలలిత అసెంబ్లీకి గైర్హాజరైనప్పటికీ సభ్యులు హాజరయ్యారని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఓటు వేసి అసెంబ్లీకి పంపితే సభకు హాజరుకాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోకముందే.. హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని స్పీకర్ నిలదీశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తుందని, అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని శివప్రసాదరావు చెప్పారు....