లోకేష్ మీద సోషల్ మీడియాలో బయటా ఎలా ప్రచారం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అది వారి మైండ్ సెట్... లోకేష్ తన పనిలో చేసే తప్పులు వెతకటం చేతకాక, తాన ఆహార్యాన్ని, పొరపాటున నోరు జారితే మాటలను అవహేలను చేస్తూ, స్పెషల్ టీంలు పెట్టి మరీ, లోకేష్ ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో ఉన్నారు కొంత మంది... కాని వీరి మాటలకి, చేష్టలకి లోకేష్ బెదరలేదు... ఏ మనిషికైనా అలా పర్సనల్ గా టార్గెట్ చేస్తే, వారి మనో ధైర్యం దెబ్బతింటుంది... అది వారి పని మీద ప్రభావం చూపుతుంది... కాని లోకేష్ ఇవేమే పట్టించుకోకుండా, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు... అక్కడ స్పెషల్ టీంలు పెట్టి విషం చిమ్ముతుంటే, ఇక్కడ స్పెషల్ టీంలు పెట్టి, ప్రజా సమస్యలు తీరుస్తున్నారు. ట్విట్టర్ లో తనకు ఎవరన్నా సమస్య చెప్తే, చిన్న సమస్య అయితే 48 గంటల్లో, పెద్ద సమస్య అయితే ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నారు... అంతే కాదు, ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు కోసం, శ్రమిస్తున్నారు...

lokesh 21082017 2

నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా, రెండు రోజుల బెంగుళూరు పర్యటనలో 22 కంపెనీల ప్రతినిధులను కలిశారు పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని ఎలక్ట్రానిక్, ఐటి కంపెనీల ప్రతినిధులను కోరారు... విశాఖపట్నంలో ఐటి కంపెనీలు, తిరుపతి,అనంతపురం లో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు అంగీకరించాయి. ముఖ్యంగా మైండ్‌ ట్రీ కంపెనీ, టెక్‌మహీంద్రా, పానసోనిక్‌, ఈ ముద్రా కంపెనీలు వెంటనే కంపెనీలు మొదలు పెట్టటానికి ముందుకు వచ్చాయి...

lokesh 21082017 3

మంత్రి నారా లోకేష్ కలిసిన వాళ్ళలో, టెక్ మహేంద్ర ప్రెసిడెంట్ అండ్ సిఓఓ రవిచంద్రన్, పేనసోనిక్ ఇండియా హెడ్ ఎనర్జీ సిస్టమ్స్ డివిజన్ అతుల్ ఆర్యా, జూనిపర్ నెట్ వర్క్స్ ఇండియా ఎండి దినేష్ వర్మ, ఈ ముద్రా ఛైర్మెన్ వి శ్రీనివాసన్, టెర్మినస్ సర్క్యూట్స్ సీఈఓ శంకర్ రెడ్డి, ఓలా క్యాబ్స్ కంపెనీ ఫౌండింగ్ పార్టనర్ ప్రణయ్, నేషనల్ పబ్లిక్ స్కూల్ ఛైర్మెన్ గోపాలకృష్ణన్, ఏఎన్ఎస్ఆర్ కంపెనీ సీఈఓ లలిత్ ఆహుజా, ఎస్ఎల్ఎన్ టెక్నాలజిస్ సీఈఓ అనిల్ కుమార్, అప్లైడ్ టెక్నాలజిస్ గవర్నమెంట్ అఫైర్స్ డైరెక్టర్ అశ్విని అగర్వాల్, స్మైల్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ అండ్ ఎండి ముఖేష్ గుప్తా, మైండ్ ట్రీ కంపెనీ సీఈఓ అండ్ ఎండి రోస్టోవ్ రావనన్, యూనిసిస్ ఎండి రవి కుమార్ శ్రీధరన్, వీరా ఎలక్ట్రానిక్స్ సీఈఓ దేవేందర్ గాంధీ , బ్లాక్ పెప్పర్ టెక్నాలజిస్ సీఈఓ హరి పురవంకర, టేసాల్వ్ కంపెనీ సీఈఓ వీరప్పన్, విన్యాస్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ నరేంద్ర, తదితరులు ఉన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read