అప్ అండ్ డౌన్ అదిరపోవాలి... నంద్యాల దెబ్బ చంద్రబాబు అబ్బా... ఇలా మీడియా ముందు, మీటింగ్లలోనూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడే రోజా, నంద్యాల, కాకినాడ ఫలితాలు తరువాత ఎక్కడా కనిపించటం లేదు అని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు... నంద్యాల ఓటర్ల దెబ్బకు చంద్రబాబు అబ్బా అంటాడు అని రోజా అన్న మాటలతో, నంద్యాల ప్రజలు రోజాకి తగిన స్థానం చూపించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న రోజాకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అప్పటి నుంచి కొన్ని రోజల పాటు రోజా ప్రజల ముందుకి రాలేక, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మొహం చాటేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు కూడా ఆ బూతులు నుంచి విముక్తి పొందాం అని ఆనందపడ్డారు...

roja 03112017 2

మళ్ళీ ఏమైందో ఏమో, అమ్మగారు మళ్ళీ ప్రత్యక్షమైంది... పాదయాత్రకు అటెన్షన్ కావలి అనేమో, జగన్ మళ్ళీ రెచ్చిపోమని పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు... ఇక ఈవిడ మళ్ళీ అవే జుబుక్సాకరమైన మాటలతో విరుచుకుపడింది.... డిజిపి సాంబశివరావు మాట్లాడుతూ, జగన్ పాదయాత్రకు పర్మిషన్ తీసుకుంటే, పర్మిషన్ ఇస్తాం అని చెప్పారు... అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజన్స్ రిపోర్ట్ చెప్తూ, పాదయాత్రలో ఏమైనా ఉద్రిక్తతలకు ప్లాన్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అన్నారు... దీనికి రోజా గారు, ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయారు... చంద్రబాబుకి కౌంట్ డౌన్ మొదలైంది, టీడీపీకి ఇక నుంచి అంతిమ యాత్రే... కుట్రలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు... చంద్రబాబుకు నరనరాన రక్తానికి బదులు కుట్రలు, కుతంత్రాలే ప్రవహిస్తాయి... రాజధాని రైతుల భూముల్ని దోచుకున్న రాక్షసుడు... పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది... చీక‌ట్లో చిదంబ‌రం కాళ్లు పట్టుకున్నాడు... అంటూ, ఇలా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ, జగన్ మెప్పు పొందే ప్రయత్నం చేసింది...

roja 03112017 3

నిజానికి, అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందో ఆమకే తెలీదు... పాదయాత్ర పెర్మిషన్ గురించి, చంద్రబాబు అన్న మాటలు గురించి, రాజకీయంగా ఇది ప్ర‌భుత్వం కుట్రే అని విమ‌ర్శించొచ్చు... అంతే కాని, ప్రతి దానికి ఇలా విరుచుకుప‌డితేనే ప్రజలు మన మాటలు వింటారు అనుకుంటే ఎలా ? విచక్షణ కోల్పోయి, చంద్రబాబు లాంటి స్థాయి నాయకుడిని, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్లు చేసుకునే రోజా, పిచ్చి పిచ్చిగా విమర్శలు చేస్తుంటే, అది జగన్ పాదయాత్రకే ఇబ్బంది... ప్రజలు ఈ పిచ్చి వాగుడికే నంద్యాలలో లాచి లాచి కొట్టారు... అయినా బుద్ధి రాకపోతే ఎలా ? ఆ అరువు తెచ్చుకున్న బీహార్ సలహాదారుడి మాటలు అయినా కొంచెం వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read